Saturday, January 9, 2016

ఏవరీ మరాఠా (ఆరె) క్షత్రీయ..!?


ఆరె మరాఠా సామాజిక వర్గం- చారిత్రక నేపథ్యం..


By Sadanand Bembre

మహోజ్వల భారత చరిత్రలో మరాఠాల చరిత్ర ఎంతో ప్రాశస్త్యం మరియు విశిష్టమైనది. జన్మతః రాజపుత్ర ( బ్రహ్మణ), ధర్మతః క్షత్రీయ, వృత్తి రీత్యా వ్యవసాయ నిపుణులు.. ఈ లక్షణాలే  హైందవ సమాజంలో మరాఠాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.  అంతే కాదు మెజారిటీ ప్రజలై ఉండి కూడా తమకంటూ ఒక రాజ్యం లేక మొగలాయి చక్రవర్తుల పాలన కింద దిక్కూ.. మొక్కూ లేకుండా బ్రతుకులీడుస్తున్న హైందవ సమాజానికి ఒక ఉనికినిచ్చి మాకూ ఓ రాజ్యముందీ అని గర్వంగా చెప్పుకునేలా హిందూ సామ్రాజ్య స్థాపన ఒక్క మరాఠాల వల్ల మాత్రమే సాకారమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడైనా మరాఠాలను ప్రస్తావించే సందర్భాల్లో వీర్ మరాఠా అన్న విశేషణాన్ని జతచేసి సంభోదిస్తారు. 
ఇక మరాఠా అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది చత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. నిజమే కాని అంతకు ముందు కూడా మనకు ఘనమైన చారిత్రిక వారసత్వం ఉంది. ప్రపంచానికి చెరుకు పంటను పరిచయం చేసింది మరాఠాలే. అదేంటి ఓ వైపు క్షత్రీయులు అంటూనే మరోవైపు వ్యవసాయ నిపుణులు అంటున్నారేమిటన్న సందేహాలు కలగొచ్చు. మరాఠీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు యుద్ధ సమయాల్లో సైనికులుగా.. యుద్ధ విరామ సమయాల్లో రైతులుగా వ్యవసాయం చేసుకునే తమ కుటుంభాలను పోషించుకునే వారు. (ఇప్పటికీ మరాఠా సామాజిక వర్గం అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో వ్యవసాయం చేసుకునే జీవనం సాగించడం గమనించాల్సిన విషయం.) శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపన యజ్ఞంలో భాగస్వామి కావడం ప్రతీ మరాఠా తన పవిత్రమైన కర్తవ్యంగా భావించారు కాబట్టే శివాజీ ఆనాడు విజయవంతంగా హైందవ సామ్రాజ్య స్థాపన చేయగలిగారు. 
అంతకు ముందు ఎంత మంది హిందూ రాజులు లేరు..వారికి సాధ్యం కాని హిందూ రాజ్య స్థాపన శివాజీ మాత్రమే ఏలా చేయగలిగారు? శివాజీ కంటే ముందు గొప్ప హిందూమత అభిమానం కలిగిన రాజపుత్ర వీరుడు రాణా ప్రతాప్ సింగ్ కు కూడా ఎందుకు సాధ్యం కాలేదు?. ఎందుకంటే వారెవరూ కూడా శివాజీ లాగ  తమ లక్ష్య సాధనలో ప్రజలను మమేకపర్చలేకపోయారు. ఆ పనిని శివాజీ చేయగలిగారు కాబట్టే ఆయన యుగ పురుషుడయ్యారు.. 

ఆరె/ మరాఠా/ ఆర్య క్షత్రీయ..

ఇంతకు మనం ఏవరం? ఆరె వాళ్లమా..!? మరాఠీలమా..!? లేక ఆర్యక్షత్రీయులమా..!? ఏది వాస్తవం..? అసలు ఆరె అంటే ఏమిటి? అది కులమా లేక జాతి పేరా? ఇలాంటి సందేహాలెన్నో మన మరాఠా సోదరులకున్నాయి. పోయిన తరానికి మనమెవరమో తెలుసు.. కాని ఎక్కడి నుండి వచ్చామో .. ఎందుకొచ్చామో తెలియనివారు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి "ఆరె" అనేది ఒక కులం పేరు కాదు. " ఆరె" అంటే ఉర్ధూ భాషలో "వచ్చిన వారు" అని అర్థం.  అవిభాజ్య హైదరాబాద్ రాజ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలోని మరట్వాడ ప్రాంతంతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలైన బీదర్ , రాయచూర్ , బీజాపూర్, యాద్గీర్ వంటి ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి. అప్పట్లో నిజాం తన పాలనా పరమైన అవసరాలకు మరాఠీ సామాజిక వర్గానికి చెందిన వారిని పాటిల్స్ గా, పట్వారీలుగా, వతన్ దారులుగా, పోలీస్ పాటిల్స్ గా నియమించుకునేవారు. ఇప్పటికీ మరాఠా వారిని "ఆరె పటేల్" అనే  సంభోధిస్తుండటాన్ని గమనించవచ్చు. కాబట్టి ఉద్యోగాల రీత్యా ఈ ప్రాంతానికి వలసలు విస్తృతంగా జరిగాయి. 
హైదరాబాదు రాష్ట్రంలో ఉర్ధూ అధికార భాషగా కొనసాగింది కాబట్టి.. అధికారిక వ్యవహారాల సందర్భంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి మరాఠీ అధికారులను గుర్తించడం కోసం ఆరె పటేల్ అని సంభోదించేవారు. అలా ఆరె అనే పదం స్థిరపడి మరాఠా కు పర్యాయ పదంగా పరిణామం చెందింది. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో మాత్రం మొదటి నుండి వారిని మరాఠీలుగానే వ్యవహరిస్తున్నారు..వారి ఉనికికి గుర్తింపు కూడా మరాఠాలు గానే కొనసాగింది.
 ఎటొచ్చి తెలంగాణా ప్రాంతంలో మాత్రమే గందరగోళం. కర్ణుడి చావుకు నూటొక్క కారణాలన్న ట్లు..  ఇక్కడ ఆరె, ఆరోళ్లు, ఆరె వాండ్లు, ఆరె పటేండ్లు, ఆర్య క్షత్రీయ, ఆరె మరాఠా అనే పేర్లతో పిలవడం ఒక కారణమైతే.. ఆ విద్య.. ఐక్యత కొరవడటం ఈ ప్రాంతంలో ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. 
అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో మన ప్రజలను వ్యవహారికంగా ఆరె పటేల్ అని సంభోధించటం వల్ల 1990 వ దశకంలో ఈ వర్గం సామాజిక నిర్మాణం పై సరైన అవగాహన లేని ఓ తహసిల్దార్ అప్పట్లో తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ప్రస్తుత దయనీయ పరిస్థితికి కారణం.



ఆర్య క్షత్రీయ

ఆర్య+క్షత్రియ= ఆర్య క్షత్రియ

సంస్కృతంలో ఆర్య అంటే గొప్ప అని అర్థం. ఆర్య క్షత్రియ అంటే గొప్ప క్షత్రీయుడు అని అర్థం. 

మరాఠా అంటే ఏమిటి..?

అసలు మరాఠా అంటే అర్థం ఏమిటి? ఇది చాలామంది మదిని తొలుస్తున్న ప్రశ్న. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 99% మంది ప్రజలకు దీని అర్థం తెలియదు. 
మర్+హఠ= మరాఠా
అంటే మరణాన్ని జయించినవాడు/ అధిగమించినవాడు/ మరణానికి ఎదురునిలిచి పోరాడే వాడు... వీరుడు అని అర్థం. 


No comments:

Post a Comment