Tuesday, January 19, 2016

అసలు సిసలు హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ




శివాజి...
(అసలైన హిందువు అసలైన సెక్యులర్)

జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ).
మరణం – 04.041680 (చైత్ర పౌర్ణమి).

17వ శతాబ్ధిలో శివాజీ మనోఫలకం పై ఆవష్కరించిన హైందవ స్వరాజ్యం అధిరోహించిన, “హిందూ సామ్రాజ్య దినోత్సవం” – 06.06.1674 (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, గురువారం).

హి.సా.ది. సంఘ ఉత్సవాలలో 2వది. (ఉగాది, హి.సా.ది., గురుపూర్ణిమ, రక్షాబందన్, విజయదశమి, మకర సంక్రాంతి)

ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ ఏడాది ఈ ఉత్సవం 31.05.2015న వచ్చింది. ముందుగా అందరికి హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు...

తల్లి – జిజియా బాయి,
తండ్రి – షాహాజీ (షాహాజీ జననం – 1599. తండ్రి పేరు – మాలోజీ). భార్య- సయీ బాయీ.
జన్మ స్థలం – పూణే జిల్లాలోని జున్నార్ పట్టణంలో శివనేరి కోటలో.
పెద్ద కొడుకు – శంభాజీ,
గుఱ్ఱం పేరు-  కృష్ణా
పుట్టినది  1627
రాజ్యాధికారం చేపట్టిన సంవత్సరం (16 సం. చిరు వయస్సులో) 1643
హైందవ రాజ్యస్థాపన 1674
మరణం 1680
మొత్తం రాజ్యపాలనా కాలం (1643 నుండి 1680) 37
హైందవ రాజ్యస్థాపన చేసి పాలించిన కాలం (1674-1680) 6

శివాజి వ్యక్తిత్వం ప్రముఖంగా నలుగురు గురువుల సాంగత్యంలో సాగింది. వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, మేథావి అయ్యాడు.

మొదటి గురువు జిజియా బాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమ వంతుడిగా తీర్చిదిద్దాయి.

రెండవ గురువు దాదాజీ కొండదేవ్. దగ్గర రాజకీయం, యుద్ద తంత్రం నేర్చుకున్నాడు.

మూడవ గురువు తుకారామ్. వీరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు శివాజీ.

నాల్గవ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మికత, హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్ఠమైనదిగా తీర్చి దిద్ద బడింది.

నవాబు కి దండం పెట్టని శివాజి.

షాజీ, తన పని చేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బారుకి తీసుకి వెళ్ళాడు. 12 సం.ల శివాజిని కూడా తీసుకు వెళ్ళాడు తండ్రి. సుల్తాన్‌కి సలాము చేసిన తండ్రి కొడుకుని కూడా సలాము చేయమన్నాడు తండ్రి. “పరాయ రాజుకు ముందు వంగి సలాము చేయను” అన్నాడు శివాజి. తండ్రి శివాజీ ధైర్యాన్ని మనసులోనే అభినందించాడు. బాల్యం నుండి అంతడి దేశ భక్తి, జాతీయాభిమానం కలిగిన వాడిగా తీర్చిదిద్దింది ఆయన తల్లి జిజియా బాయి.

ఆవు – శివాజి

ఒక నాడు ఒక ముస్లిము ఒక ఆవుని వధించడానికి లాక్కుపోతుండగా చూసాడు శివాజి. 10 సం. కూడా నిండని శివాజి ఆ ముస్లిముతో ఆవుని విడిచేదాకా వాదులాడాడు. కబేళాకి తరలిపోతున్న ఆవుని విడిపించాడు.

శివాజి – తోరణ దుర్గ కోట విజయం

16 సం. ప్రాయంలోనే శివాడీ తోరణ్ కోట (దుర్గా)న్ని జయించాడు. ఈ విజయంతో శివాజీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కొండదేవ్ శిక్షణని అంత అద్భుతంగా ఒడిసి పట్టాడు శివాజి.

శివాజి – తల్లి కొరిక శింహ ఘడ్

చదరంగంలో ఓడిపోయిన శివాజీని ముస్లిముల ఆధిపత్యంలో ఉన్న సింహ ఘడ్‌ని బహుమతిగా ఇమ్మంది తల్లి. పుత్రుడి పెళ్ళి పనిలో నిమగ్నమైన తానాజీని పిలిపించాడు. తల్లి కొరికని చెప్పాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు తానాజీ. భయంకర యుద్దం చేసి కోటని స్వాధీనం చేసుకున్నారు సైనికులు. తానాజీ వీరమరణం పొందాడు. “సింహ గడ్ లభించించి కాని సింహం పోయింది” అన్నాడు శివాజి. కొడుకు పెళ్ళిని కూడా లెక్క చేయాక శివాజీ ఆజ్ఞని సిరసావహించి, వీరమరణం పొందిన ఈ ఉదంతం శివాజీ మాటకి అతడి సైనికులో ఎంతటి విలువ ఉందో తెలియ జేస్తుంది.

శివాజి – ఆంధ్ర పర్యటన

1677 లో భాగ్యనగర్ వచ్చిన శివాజి, అక్కడ నుండి శ్రీశైలం వెళ్ళి అష్టాదశ పీఠాలలో ఒకటైన బ్రమరాంబ దేవిని దర్శించాడు. ఆమెకి తన శిరస్సుని బలిగా ఇద్దామని ప్రయస్తున్న శివాజికీ అమ్మ ప్రత్యక్షమై- నీ శిరస్సుని నా కెందుకు. నీ అవసరం దేశానికి చాలు ఉంది. నీ మెధస్సుని, క్షాత్రాన్ని, ధర్మ రక్షణకై వినియోగించు అని పలికిన అంబ శివాజీకి ఒక ఖడ్గాన్ని కానుకగా ఇచ్చింది. శివాజి శేష జీవితాన్ని ధర్మ రక్షణకై వినియోగించారు. ఈ ఉదంతంతో, హైందవ పరిరక్షణ బాధ్యతని దైవమే స్వయంగా శివాజీకి ఇచ్చిందని తెలుస్తుంది.

శివాజీ రాజ్యం – ఇతర ఎన్నో రాజ్యాలు

విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు, హరి-హర, బుక్కరాయలులాంటి వారు సామ్రాజ్యాన్ని స్థాపించి వ్యాపించిన తరువాతనే ప్రసిద్ధి పొందారు. శివాజీ స్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా, శివాజి రాజ్య విస్తరణకు పూర్వమే శివాజీ పేరు విన్నంతనే ముస్లిము రాజులకు వణుకు పుట్టేది. శివాజి స్వయంగా ప్రతిసైనికుణ్ణి భర్తీ చేసి తన రాజ్యాన్ని బరహన్ పూర్ (నేడు భుసావల్, జలగావ్) నుండి బెంగుళూరు వరకూ, బీజాపూర్ నుండి పశ్చిమ సముద్రం వరకూ వ్యాపింపచేసాడు. రాజ్యపాలన సౌలభ్యం కొరకు నలుగురు గవర్నర్లను నియమించాడు. సతారాలో పీష్వా (పధాన మంత్రి) పూణేలో ఉండేవారు.

క్రమంగా 28 సంవత్సరాలు వచ్చే సరికి కోండాణా, పురందర్, ప్రతాప్ ఘర్, రాజ ఘర్, చాకణ్ తో పాటు మరోక 40 కొటలపై విజయం సాధించి విజయపతాన్ని ఎగురవేసాడి శివాజి.
మరోక పక్క ఆంగ్లేయులు, పోర్చుగీసువారు, అప్పటికే దేశంలో ఉన్న ముస్లిములు, మొగలులు దేశాన్ని మరింత ఆక్రమించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

శివాజీ - రాజ్యపాలన

ఈ నాడు మనం సామ్యవాదం, సోషలిజం, లిబరలిజం, ప్రజాతంత్రం అనే మాటలను పదే పదే వింటుంటాము. శివాజీ పాలనలో ఇవి అన్ని సర్వసమావేశమై ఉండేవి. అన్ని మత, పూజా పద్ధతులను పాటించేవారికి సమాన హోదా ఉండేది.

శివాజీ – పళ్ళ బుట్ట

అవసరమైనప్పడు శివాజీ మొఘలురాజులకు లొంగినట్లు నటించి వారి శతృ సైన్యం సాయంతోనే బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించాడు శివాజి. ఈ క్రమంలో 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. శివాజిస తన ఆరేళ్ళ కొడుకుతో ఔరంగజేబు కలవడానికి వచ్చాడు. వంచించడమే తెలిసిన  ఔరంగజేబు శివజీనీ, శంబాజీని చంపేస్తే మరాఠాల విద్రోహన్ని తట్టుకోవడం కష్టమని తలంచి వారిద్దిరిని చెఱసాలలో వేసాడు. శివాజీ ఆగ్రాలోని ఆపన్నులకు పళ్ళను పంపండానికి అనుమతి పొందాడు. కొన్ని నెలల తరువాత, ఎమరుపాటుగా ఉన్న ఔరంగజేబు బటుల కళ్ళుగప్పి,  మారువేషంలో శివాజీ, తన కొడుకుతో సహా పళ్ళ బుట్టలు దాగుని తప్పించుకున్నాడు. ఇలాంటి సమయస్ఫుర్తితో ఎప్పటికప్పుడు నూతన పథకాలతో తని పనిని పూర్తి చేసాడు శివాజి.

శివాజీ - రొడ్ల విస్తరణ, భవన నిర్మాణం

శివాజి పెద్ద పెద్ద రొడ్ల నిర్మాణం చేయించి, వ్యవసాయ, వర్తక వ్యాపారానికి పెద్ద పీట వేసి సర్వాంగీణ వికాశానికి తొడ్పడ్డాడు. సమాజంలోని అన్ని వర్గాలు సుఖంగా, సమృద్దిని సాధించాయి.

శివాజీ - స్వదేశీ విజ్ఞానం

ఐరోపా నుండి ముద్రణ యంత్రాలను తెప్పించి, ఆ యంత్రాల అధ్యయనం చేసి స్వదేశీ అవసరాల కనుగుణంగా నూత యంత్రాల అవిష్కరణని ప్రోత్సహించాడు.

యుద్ధం నెగ్గడంలో అస్త్ర-శస్త్రాల ప్రాముఖ్యతని గుర్తించిన శివాజి, విభిన్న దేశాల నుండి అత్యాధునిక అస్త్ర-శస్త్రాల తెప్పించి, స్వదేశీ విజ్ఞానాన్ని జొడించి వాటిని మరింత మెరగు పరిచి యుద్ధాలలో వాడుకలోకి తీసుకవచ్చాడు.

అదే విధంగా అప్పటికే ప్రవంచంలో ఉన్న పెద్ద ఓడలను కొనుగోలు చేసి, స్వదేశంలో ఉన్న నౌకా శాస్త్ర గ్రంథాల అధ్యయనంతో వాటిని మరింత మెరుగపరిచి ప్రపంచంలో అత్యంత పెద్ద ఔడల నిర్మాణం చేయించాడు. వ్యాపారానికి, యుద్ధానికి ప్రత్యేకమైన నౌకల నిర్మాణం చేపట్టాడు. ఆనాడు శివాజి దగ్గర ఉన్న ఓడలు విదేశీయులను ఆశ్చర్యంలో ముంచెత్తేవి.

ఈ విధంగా శివాజీ శాస్త్ర-సాంకేతికతకి పెద్ద పీట వేసీ ఉత్తమ ఫలితాలను సాధించాడు.

శివాజి – భాష

ప్రతి దేశానికి తన సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకు పోవడానికి భాష చాలా అవసరం. ఆయా ప్రదేశాలలో జన్మించిన భాష మాత్రమే ఈ పని చేయగలదు. కాని విదేశీ ఆక్రమణ దారులు, దౌర్జన్యపూరితంగా ఫారసీని స్థానీయ రాజ్య భాషగా, స్థానీయ భాషగా పాదుకొల్పారు. శివాజి ఈ విదేశీ భాషని తీసి వేసి స్థానీయ భాషని పాలనా భాషగా, ప్రజా భాషగా అభివృధ్ధి చేసాడు.

శివాజి – హిరకణి (గోబాల)

హిరకణి అనే గో బాలిక, శివాజీ కోటలో పాలు అమ్ముకునేది. ఒక సారి అమ్మకం ముగించుకుని ఇంటికి పోదామనుకునేసరికి రాత్రి కావడంతో కోట ముఖద్వారం మూసివేయబడింది. తన పసి బిడ్డడికి పాలు పట్టించవలసి ఉండటంవలన ఒక బండరాయపైకి ఎక్కి కొట దాటి, ఇల్లు చేరుకుని బిడ్డడికి స్తన్యాన్నిచ్చింది ఆ తల్లి.

ప్రముఖద్వారం మూసిఉన్నప్పటికి కొట దాటే మార్గాంతరాన్ని బయట పెట్టినందుకు ఆమెని సన్మానించాడు శివాజి. ఏ బండరాయిని ఎక్కి ఆమె బయట పడిందో దానిని కొట్టించి కొటని మరింత కట్టుదిట్టం చేసాడు శివాజి. ఈ నాటికి ఈ స్థలాన్ని హిరకణి దుర్గం అని పిలిస్తారు.

ఈ ఉదంతం తన కోట యొక్క పటిష్టత, సంరక్షణకి శివాజీ ఎంతటి ప్రాధాన్యతని ఇచ్చాడో తెలియజేస్తుంది. అదే విధంగా ఈ రోజు సైబర్  పటిష్టతకోసం హేకర్లను నియమించుకుని అంతర్జాల పటిష్టతని మరింత మెరుగుపరుచుకుంటున్నామా, శివాజీ ఆ గోబాలకి సన్మానం చేసి పారితోషకాన్ని ఇచ్చి అలాంటి పనినే సాధించాడు.

శివాజి – న్యాయమూ, చట్టమూ

రాంఝా గ్రామం పటేలు ఒక స్త్రీని బలత్కరించినట్లుగా తెలిసింది. విచారణలో అది నిజమని కూడా నిర్థారించబడింది. శివాజీ ఆ పటేలుకి కాళ్ళూ చేతులు నరికివేసే శిక్ష విధించి అమలు పరిచాడు.

శిక్షలను అమలు పరచడంలో ఎంత మాత్రం చాప్యం చెయ్యని కారణంగా శివాజి పరిపాలనలో నేరాల సంఖ్య బహుకొద్దిగా ఉండేవి.

శివాజీ – స్త్రీ గౌరవం

శివాజీ సైనికులు ఒక అత్యంత సుందరమైన ముస్లిము యువతిని బలవంతంగా తీసుకు వచ్చి శివాజీ ముందు హాజరు పరిచి శివాజీ వారి చర్యని అభినందించి బహుమానం ఇస్తాడనుకున్నారు. సైనికులను హెచ్చరించిన శివాజీ ఆమె కాళ్ళపై బడి – తల్లి నా సైనికులు చేసిన పనికి క్షమించు. నా తల్లి కూడా ఇంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకేంత అందంగా పుట్టి ఉండేవాడినో అని,. ఆ ముస్లిము యువతిని సకల రాజలాంచనాలతో ఆమె ఇంటికి పంపించాడు శివాజి.

ముస్లుములు, అన్య మతస్తులు, ప్రముఖంగా మహిళలకి ఎన లేని గౌరవాన్ని ఇచ్చాడు శివాజి. ఎవరికి భయం పడకుండా సంచరించే ఉత్తమ పరిపాలనని అందించాడు శివాజి. ఈ రోజు మైనారిటీ వాదమని, మహిళా అధికారాలని, సెక్యూలరిజం అని అంటున్న ఎన్నింటినో శివాజి వాస్తవంగా సాధించి చూపించాడు.

శివాజీ – మతసరసత

శివాజీ తన పాలన లో ఎక్కడ ఎవరికి ప్రత్యేకతలను ఇవ్వకుండా అందరికి సమాన హోదా కల్పించి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించి, అందరికి బద్రత కల్పించాడు. గుళ్ళు గోపురాలతో పాటు ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు ఉండడమే కాక,  ప్రముఖ విభాగాలైన ఆయుధాల విభాగానికి - హైదర్ ఆలీ, నావికాదళానికి - ఇబ్రహీం ఖాన్, మందుగుండు విభాగానికి - సిద్ది ఇబ్రహీం అధ్యక్షత పదవీ బాధ్యతలును నిర్వహించారు. దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ లు సర్వ సైన్యాధ్యక్షులుగా ఉండేవారు. విశేషమేమిటంటే, శివాజీ అంగ రక్షకులలో చాలా ప్రముఖ వ్యక్తి మదానీ మెహ్తర్‌. ఇతను శివాజీనీ అగ్రా కోట నుండి తప్పించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు.

మత ప్రాతిపధిక కాక, యోగ్యతకి పెద్ద పీట వేసి, మైనారిటీ, మెజారిటీ అనే నేటి కుహాన విభజనకి అతీతంగా అందరూ సమానమే అనే భావనని నెలకొల్పిన హిందూ రాజు శివాజి. అందుకే శివాజి గొప్ప హిందువు. మరియు నేటి భాషలో గొప్ప సెక్యూలరిస్టు.

శివాజి - అఫ్జల్ ఖాన్

శివాజీ పరాక్రమం, మెరుపుదాడులు, గెరిల్లా యుద్ద పద్దతులను ఎదుర్కోలేనని అఫ్జల్ ఖాన్ శివాజీనీ ప్రత్యక్షంగా యుద్దభూమికి రప్పించి ఓడింద్దామని అనుకున్నాడు. శివాజీ ఇష్ట దైవమయిన భవానీదేవి దేవాలయాలను కూల్చేసి, శివాజీని రెచ్చకొట్టాడు అఫ్జల్ ఖాన్. మొగలుల వ్యవహారశైని బలాబలాలను, పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట అయిన శివాజీ, యుద్దానికి దిగకుండా సంధికి దిగాడు. ప్రతాప్‌ఘడ్ కోటలో సమావేశానికి ముందు ఇనుప కవచాన్ని ధరించి, పులిగోర్లు పెట్టుకుని బయలుదేరాడు. శివాజి. అఫ్జల్ ఖాన్ శివాజీనీ రా భాయీరా అని కౌగలించుకుని కత్తితో పొడిచి హత్య చేద్దామని ప్రయత్నించాడు. ఇనుప కవచం శివాజీని రక్షించింది. శివాజి మోరుపు వేగంతో తన ముందే తెచ్చుకున్న పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పై దాడి చేసి వధించాడు శివాజి.

పదే పదే దేశం మీద తెగపడుతున్న నేటి పొరుగుతో శిఖరాగ్ర చర్చలు జరుపుతున్న మన ప్రభుత్వాల వ్యవహార శైలికి భిన్నంగా, ఈ ఉదంతం, శివాజీ అంటే నిరంతర అప్పమత్తత, సరియైన సమయంలో సరియైన ఆక్రమణ. స్నేహితిడికి స్నేహితుడు. శత్రువుకి శత్రువు. మంచికి మంచి. చెడుకి చెడు అనే శివాజీ వ్యవహార శైలిని తెలియ జేస్తుంది.

శివాజి - ఔరంగ జేబు

శివాజీ ఔరంగ జేబుకి ఒక లేఖ రాసారు. అందులో ఎన్నో విషయాలు చర్చిస్తూ అంతిమంగా ఇలా రాసారు –

“చక్రవరీ! ఖురాన్ దేవుడిని రబ్బుల్ అలమీన్ గా వర్ణించింది. అంటే విశ్వానికి అంతటికి దేముడు. కేవలం ముసల్మానులకు దేముడని కాదు. ఇస్లాము. హైందవము రెండూ అతీత శక్తులకు సుందరమైన భాష్యం చెప్పాయి. మసీదులో ప్రార్థనకి పిలుపునిస్తే, గుడిలో గంట కొడతారు. మతోన్మాదం, మత విద్వేషం కలవారెవరైనా దేవుడి ఆదేశాలకు వ్యతిరేకంగా నడుస్తున్నట్లే అర్థం. ఇలాంటి పనులు చేసేవారు దేవుడనే కళాకారుడి సృష్టిని ఎదిరిస్తున్నట్లే అర్థం. ఏ రకమైన సృష్టిలో లోపాలు వెదికినట్లైతే దానికర్థం మీరు ఆ కళాకారుడుని వ్యతిరేకిస్తున్నట్లే కదా. అలా చేయకండి.”

ఇలా స్పష్టంగా చెప్పడమే శివాజీ సెక్యూలరిజం. అంతే కాని బుజ్జగింపు ధోరణితో అన్నీ సమానమంటు ఊక దంపడు ఉట్టికింపులివ్వడం శివాజీ నైజం కాదు.

బ్రిటీషు సైన్యం – శివాజి సైన్యం

1795లో వింధ్య పర్వతాలలో ఆంగ్లేయులకి శివాజీకీ పోరు జరిగింది. శివాజీ నాయకుడు మహోదాజీ సింథియా. అప్పటి పీష్వా ఫడ్నవీస్. ఈయన శివాజీ సైన్యంలో గుఱ్ఱపు స్వారీరాని ఏకైక వ్యక్తి. శివాజీ సైన్యం చాలా చిన్నది. బ్రిటీషు సైన్యం చాలా పెద్దది. ఒక పక్క గుఱ్ఱపు స్వారీ రాని నాయకుడు, మరోక పక్క చిన్న సైన్యం అయినా ఆంగ్లేయులు శివాజీ సైన్యంలో అత్యంత దారుణంగా ఓడిపోయారు. ఈ ఉదంతాన్ని, బ్రిటీషువారు, ప్రపంచ చరిత్రలో ఇంతటి పరాజయాన్ని ఎన్నడు చూడలేదని చరిత్రకారుల అభివర్ణించారు.
నిజానికి ప్రపంచ చరిత్రలో ఏర్పడిన రాజులను చూస్తే వారి ముందు శివాజీ బుడతడే.... కాని పరాక్రమంలో, నిష్ఠలో, నిజాయితీలో, వ్యవహారికతలో, నేర్పులో, నిర్భయత్వంలో, మానవత్వ, సమానత్వంలో ప్రపంచంలో ఉద్భవించిన రాజులలో అందిరిలోకి ఉన్నతమైన వాడు శివాజి.

శివాజి-వియత్నాం

వియత్నామ్ అప్పటి రక్షణ శాఖ మంత్రి అయిన మేడమ్ బిన్ 1977 లో భారత పర్యటించినపుడు, శివాజి మా ఆదర్శం అని చెపుతూ, శివాజి విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. వియత్నమ్-అమెరికా లాంటి పెద్ద దేశంతో తలపడినపుడు, వియత్నామ్ కి శివాజీ గోరిల్లా వార్ ఫేర్ వ్యూహం చాలా సహకరించింది.

అటువంటి శివాజీ గురించి మన ఎన్.సి.ఆర్.టి.సీ. చరిత్ర పుస్తకాలు ఒక పేజీలో నాలుగు వాక్యాలు రాసి చాలు అని పించాయి.

శివాజి – హిందూ రాజుల తప్పలు

శత్రువుని క్షమించని శివాజి – ఫృథ్విరాజ్ జౌహాన్ గజనీ ని 16 సార్లు క్షమించి వదిలాడు. చేసిన తప్పునే పదే పదే చేసాడు. గజనీ ఒక్కసారి ఫృథ్విరాజ్ ని ఓడించగానే అతడి కళ్ళు పీకించి చెఱసాల పాలు చేసి, తరువాత హత్య చేసాడు. శివాజీ శత్రువుకి క్షమాబిక్ష పెట్టడం, వదిలివేయడంలాంటి తప్పిదాలను చేయకుండా శత్రువుని శత్రువుగానే చూసి తగిన శిక్ష వేసిని కారణంగా శత్రువు ఆక్రమణ చేయడానికి కూడా భయపడేలా చేయగలిగాడు శివాజి.

శివాజీ తన యుద్ధ పంథాని కాలానుగుణంగా మార్చుకున్నాడు. ధర్మ బద్ధమైన యుద్ధం చేయని శత్రువు దగ్గర ధర్మం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. అందుకే శివాజి ఎప్పటి, కప్పుడు విజయానికి ఏది ఉత్తమమో అదే చేసాడు.

అర్హలైన అందరిని సైన్యం చేర్చుకున్న శివాజి –  జన్మతః క్షత్రియుడు మాత్రమే పోరాటానికి అర్హుడనే అనుచానంగా వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి, సమాజంలోని అన్ని వర్గాలలోని బలమైన వారి ఎన్నుకుని ఒక ధృడమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, అన్ని యుద్దాలలోనే విజయాన్ని సాధించాడు శివాజి.

కాల బాహ్యమైన ఆచారాలను, పద్దతులను తుంగలోకి తొక్కి నేటి అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించడం కారణంగా శివాజీ హైందవానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగాడు. పూర్వం జరిగిన తప్పిదాలను కూడా సవరించగలిగాడు.

అనర్థ హైతువైన ఢాంభికానికి పోని శివాజి – పొగరుబోతుగా వ్యవహరించి, అనవసరమైన ఢాంభికానికి పోయి, శత్రువు యొక్క బలా-బలాల అంచనా వేయకుండా శత్రువు ఎంత బలాడ్యుడైనా ఎదురేగి పోరాడే అనర్థ హేతువైన వీరత్వాన్ని ప్రదర్శించని శివాజి. దానికి బదులుగా, అదును చూసి, శత్రువుని తమ చిన్న సైన్యంతో జయించగలమని అనుకున్నప్పడు మాత్రమే ఎదురించి, విజయాన్ని సాధించిన శివాజి.

నేనే హీరోని. రండి చంపండి అని ఊరికే తన ప్రాణాన్ని తీసుకు పోయి శత్రువు చేతిలో పెట్టలేదు శివాజి. శత్రువు బలమైన వాడైతే, తెలివితో యుద్దం చేసాడు. శత్రువుని ప్రత్యక్షంగా ఎదుర్కోగలనని అనిపించినప్పుడు మాత్రమే ప్రత్యక్ష యుద్ధం చేసాడు. యుద్ధ తంత్రాన్ని బహు గొప్పగా ఉపయోగించిన వాజు శివాజి.

పొరుగు రాజ్యాలతో స్నేహ సంబంధాలు ఆశించిన శివాజి –హిందూ రాజులలో సఖ్యత లేని కారణంగా ఎక్కడ నుంచో వచ్చిన, ఇక్కడి సంస్కృతి, పరిస్థితులు తెలియని విదేశీ రాజు హిందూ రాజులపై పైచేయి సాధించి తమ రాజ్య విస్తరణ చేసుకున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలు గల దేశ చరిత్రని క్షుణంగా అధ్యయనం చేసిన శివాజి పొరుగు రాజ్యాలతో సఖ్యత సాధించి దండయాత్రలు చేసిన ముస్లిము, మొగలు రాజులకు సింహస్వపంగా మారాడు.

ఈ నాడు ప్రభుత్వ తలపెట్టిన “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” అనేదే ఆ నాడు శివాజీ ప్రారంభించి విధానమే.

ఇది శివాజీ సంక్షిప్త చరిత్ర. ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకోవలసిన హైందవ సామ్రాజ్యాధిపతి కథ. మనందరికి నిత్య స్మరణీయుడు. మన జాతి రత్నం శివాజి.

శివాజీ మహారాజ్ కీ జై.

అంతిమంగా

ఇది మన సత్తా

సా.శ. 7వ శతాబ్ధంలో ప్రారంభంమయిన వేరు వేరు ముస్లిము తెగల దండయాత్రలు మహమ్మద్ గజనీ (11వ శతాబ్ధం), మహ్మమ్మద్ ఘోరీ (12వ శతాబ్ధం)లతో తారాస్థాయికి చేరుకున్నాయి. తురుఘ్కలూ, అరబ్బులూ, ఇరానీలు, మొగలులూ, అప్గనులూ భారత్ పై మీదికి మిడతల దండుల్లా వచ్చి పడ్డారు. దేశమంతటా విస్తరించి దారుణమైన మారణకాండ చేసి, వినాశనం సృష్టించారు. పవిత్ర స్థలాలను అపవిత్రం చేశారు. హిందూస్థాన్ దీనికి వ్యతిరేకంగా 800 ఏళ్ళపాటు విరామమెరుగని స్వాతంత్ర్య సమరం సాగించింది. బహుశా ప్రపంచ చరిత్రలోనే జాతి స్వేచ్ఛ కోసం ఇంతగా కదిలించిన సమరగాథ మరొకటి కానరాకపోవచ్చు. రాజస్థాన్ లో మహారాణా, కుంభ్ నుంచి మహారాణా ప్రతాప సింహ్, రాజసింహ్లు వరకూ, దక్షిణాన బుక్క సోదరుల నుంచి శ్రీ కృష్ణ దేవరాయల వరకూ, మహారాష్ట్రలో శివాజి నుంచి పీష్వాల వరకూ, పంజాబులో గురుగోవింద్ సింహ్ వంటి అమరవీరులూ, గురువుల నుండి బందా బైరాగీ, రంజీత్ సింహ్ ల వరకూ, బుందేల్ ఖండ్ లోని ఛత్రసాల్ మొదలుకొని అస్సాములోని లాచిత్ బాస్కర్ బడ్ ఫుకన్ వరకూ లెక్కకు మించి యోధాగ్రేసరులు స్వాతంత్ర్య నౌకని అనేక తుఫానుల్లోంచి భధ్రంగా ముందుకు నడిపారు. వారి విడుపులేని పోరాటం కారణంగా, తిరుగులేని దెబ్బల మూలాన ఇస్లాము విజయ ఖడ్గం ముక్కలై మట్టి కరిచింది. మౌలానా హాలీ విలపించినట్లు- “సప్త సముద్రాల మీద ఎదురులేకుండా, ఓటమి ఎరుగ కుండా వీరవిహారం చేసిన ఇస్లాము అనే నౌకాదళం హిందూస్తాన్ చేరుకునే సరికి గంగలో మునిగిపోయింది”.

- హెచ్. వి. శేషాద్రి, కాళ రాత్రి (దేశ విభజన విషా గాథ) పుస్తకం నుండి.....
(Srinivas Rao vumaji)