Sunday, January 10, 2016

బెంగాల్ లో మమతాదే హవా...


న్యూఢిల్లీ, మే 10: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిసాయో లేదో వివిధ చానెళ్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను మంగళవారం వెల్లడించాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న వామపక్ష కూటమి ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకు పోతుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. తృణమూల్ కాంగ్రెస్ కూటమి విజయదుందుభి మోగిస్తుందని పేర్కొన్నాయి. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం వివిధ చానెళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వేర్వేరుగా ఉన్నాయి. తమిళనాడులో ఎఐఎడిఎంకె కూటమి ఆధిక్యంలో ఉందని సిఎన్‌ఎన్-ఐబిఎన్-సిఎస్‌డిఎస్ సర్వే పేర్కొనగా, ఎఐఎడిఎంకె, డిఎంకె కూటములకు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వే తెలిపింది. అలాగే కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్) స్వల్ప ఆధిక్యంలో ఉందని సిఎన్‌ఎన్-ఐబిఎన్ సర్వే పేర్కొనగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని హెడ్‌లైన్స్ టుడే తెలిపింది. అసోంలో కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని సిఎన్‌ఎన్-ఐబిఎన్ పేర్కొనగా, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని హెడ్‌లైన్స్ టుడే వెల్లడించింది. పరిశోధనా సంస్థ సి-వోటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుంది. తమిళనాడులో ఎఐఎడిఎంకె మంచి మెజారిటీ సాధిస్తుంది. అసోంలో హంగ్ ఏర్పడుతుంది. కేరళలో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుంది. కేరళలో వామపక్ష కూటమి ఓడిపోతుందని, యుడిఎఫ్ అధికారంలోకి వస్తుందని స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ సర్వే కూడా తెలిపింది.
హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వే ప్రకారం.. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్- కాంగ్రెస్ కూటమి మూడింట రెండు వంతుల ఆధిక్యంతో అధికారంలోకి వస్తుంది. 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కూటమికి 210 నుంచి 220 స్థానాలు వస్తాయి. ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్ష కూటమి కేవలం 65 నుంచి 70 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని ఈ సర్వే సూచిస్తోంది. అలాగే 10 నుంచి 15 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందుతారని సర్వే వెల్లడించింది. స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ 181, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయపతాకం ఎగురవేస్తాయి. లెఫ్ట్ ఫ్రంట్ బలం ప్రస్తుతం ఉన్న 227 స్థానాల నుంచి 62 స్థానాలకు పడిపోతుంది.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 88 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తుందని స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి కేవలం 49 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని పేర్కొంది.
అదో చెత్త సర్వే: సిపిఎం
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఓడిపోతుందనే హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వేను చెత్త సర్వేగా సిపిఎం కొట్టిపారేసింది. ఈ సర్వేకు శాస్ర్తియ ఆధారం లేదని సిపిఎం పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యదర్శి, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కోల్‌కతాలో విలేఖరులతో మాట్లాడుతూ.. వామపక్ష కూటమి ఓడిపోతుందనే జోస్యాన్ని టివి చానెళ్లు పోటీ పడి ప్రసారం చేస్తున్నాయని, అయితే వాస్తవం మరోలా ఉంటుందని రుజువవుతుందని అన్నారు. 2001 నుంచి బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తప్పని రుజువవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా అధికారంలోకి వస్తుండడాన్ని అడ్డుకోవడానికి, ప్రజల మనసులను ప్రభావితం చేయడానికి ఇలాంటి సర్వేలు విఫలయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వరుసగా ఆరోసారి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని గోపిబల్లవ్‌పూర్, బిన్‌పూర్‌లలో కొన్ని బూత్‌లలో సిపిఎం ఏజెంట్లను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, మావోయిస్టులు బెదిరించారని బిమన్ బసు ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

నిజంగా రిజర్వేషన్లు ఉద్దరిస్తున్నదెవరిని?


* ఓ.సి సామాజిక వర్గాల్లో పెరుగుతున్న అసహనం
*  పదేళ్ల వెసులుబాటు శాశ్వత హక్కెలా అయ్యింది
* నిజానికి అంబేద్కర్ కాంక్షించిందేమిటీ?
* ఉన్నత వర్గాల్లో సామాజిక అంతరాల           మాటేమిటి?
* రాష్ట్రానికో విధానమా..!?

వాస్తవాల ప్రాతిపదికన రిజర్వేషన్‌ల వర్గీకరణ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వాతంత్ర్యం సిద్దించి దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తున్నా..ఇంకా కాలం చెల్లిన కులాల వారీ రిజర్వేషన్లు సరిచేయకపోవడంతో రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్నామన్న భావనతో ఉన్న OC సామాజిక వర్గాలలో అసహనం తీవ్రతరమవుతోంది.

 ఇప్పటికే గుజరాత్‌లో పటేల్ వర్గం నుండి తమకూ రిజర్వేషన్లలో భాగం కల్పించాలంటూ హర్థిక్ పటేల్ సారథ్యంలో ఉధ్యమం ఊపందుకుంది. మహరాష్ట్ర లో మరాఠాలు అదే దారిలో ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా మరాఠా సామాజిక వర్గానికి18% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నా కోర్టు జోక్యంతో నిలిపేశారు. ఇక్కడ తెలంగాణాలో రెడ్డి సామాజిక వర్గం రిజర్వేషన్లు రద్దు కోరుతూ ఉద్యమం నిర్మాణం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం అద్వర్యాన ఎప్పటి నుంచో ఉద్యమం జరుగుతున్నా ఈ మద్య దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీలను వర్గీకరణ చేయాలని మందకృష్ణ గళమెత్తుతున్నారు. దానాదీనా మొత్తంగా రిజర్వేషన్లు సమీక్షించి ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఓసి కులాల నుండి బలంగా వినిపిస్తోంది. వారి డిమాండ్ లోనూ న్యాయముంది.
 ఉదా: రెడ్డి, వెలమ, బ్రహ్మణ , క్షత్రీయ, కమ్మ , వైశ్య వర్గాలు సామాజికంగా ఉన్నతవర్గంగా కొనసాగుతున్నప్పటికీ అందరూ కోటీశ్వరులు కాదు.. కూటికి కూడా గతిలేక కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు కోకొల్లలు.. సామాజిక హోదా ఒక్కటే కూడు పెట్టదు కదా..!? అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలలో అపర కుబేరులూ..ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా  అర్హులైన వారిలో ఎంత మందికి రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయి? ఇక్కడా ధనవంతుల ప్రయోజనాలే కదా వాస్తవంగా నెరవేరుతున్నది..!? నిజానికి ఉన్నత వర్గాలని చెప్పబడుతున్న సామాజిక వర్గాలలోనూ అంతర్గతంగా ఎన్నో వైరుధ్యాలు.. మరెంతో వివక్ష ఉంది. రెడ్డిలలో గుడాటి కాపు, ముఠాఠి ( వీరినే మరాఠీ) కాపు, గోనే కాపు, చౌదరి రెడ్డి, క్యాథలిక్ రెడ్డిలని, అలాగే బ్రహ్మణుల్లో వైదికులు, వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, నియోగులనీ.. వైశ్యుల్లో కోమట్లు, అరవ కోమట్లు అని భిన్నమైన తెగలున్నాయి.

ఇందులో ఆర్థికంగా కనీసం ఒక పూట కూడా తిండికి నోచుకోని వారి జనాభా లక్షల్లో ఉంది.

 ఇకపోతే సామాజికంగా వెనకబడిన వర్గాలలోనూ సామాజిక అంతరాలు ఉన్నాయి. ఆర్థికంగా బలవంతులైన వారికి రిజర్వేషన్‌లు అవసరమా? అందుకే క్రిమిలేయర్ నిబంధనను అమలు చేయాలన్న వాదన ఉంది. రిజర్వేషన్లు దర్జాగా అనుభవిస్తున్న వారు వ్యతిరేకిస్తున్నారంటే అర్థముంది..! ఎందుకంటే ఆ నిబందన అమలు చేస్తే ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయంగా తమ పట్టు సడలిపోతుంది కాబట్టి..! కానీ...దానిని కుల సంఘాల నాయకులే వ్యతిరేకిస్తున్నారంటే ఏమనుకోవాలి? వారు ఏవరి ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని భావించాలి?

ప్రభుత్వాల ఓటు బ్యాంక్ మార్క్ రాజకీయాల పాపాల ఫలితంగా సామాజిక అసమానతల స్థానం లో ఆర్థిక అసమానతలు.. పొడసూపుతున్నాయి. రిజర్వేషన్ సిస్టం అంతిమంగా సామాజిక సంఘర్షణలకు దారితీస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఇలాంటి పరిణామాలకు సంబందించిన సంకేతాలు కనిపిస్తున్నాయి.

భారత్ రిపబ్లిక్ గా అవతరించే క్రమంలో రాజ్యాంగ రచనా సంఘం ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బలహీనమైన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తేవాలని లక్ష్యించి కేవలం పదేళ్ల పాటు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నా తదనంతర కాలంలోనూ అది ఇంకా కొనసాగుతుండటానికి కారణాలు బహిరంగ రహస్యమే...!.

పాలకుల నిర్వాకం ఫలితంగా రాను రాను రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్న వర్గాలు అవి తమ శాశ్వత హక్కులు గా పరిగణించే స్థాయికి చేరింది పరిస్థితి. ఫలితంగా సామాజికంగా ఉన్నతమైన వర్గంలో ఉన్నా అర్థికంగా వెనకబడ్డ వర్గాలలో అసహనం మొదలైంది. రాజ్యాంగం ఏ లక్ష్యంతోనైతే రిజర్వేషన్లు అమలు చేయాలని తలచిందో అది నెరవేరకపోగా అందుకు విరుద్ధంగా పరిస్థితులు మరింత  దిగజారేందుకు కారణంగా మారిపోయింది.

రిజర్వేషన్ల రుచి మరిగిన పొలిటికల్ పార్టీలు ఫక్తు రాజకీయ ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న ఇలాంటి రిజర్వేషన్ల రాష్టానికోరకంగా ఉండటాన్ని పరిశీలిస్తే వాటి అంతిమ లక్ష్యం ఏమిటో మనకు స్పష్టం గా అవగతమవుతుంది. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల  ఆర్థిక అంతరాలు పెరిగి సామాజిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. మద్యలో ఒకటి..రెండు సార్లు రిజర్వేషన్ సిస్టంను సంస్కరించేందుకు ప్రయత్నాలు జరిగినా పెద్ద ఎత్తున చెలరేగిన ఆందోళనలు ప్రభుత్వాల చేతులు కట్టిపడేశాయి.

నిజంగా అంబేద్కర్ గనుక ఇప్పుడు బ్రతికి ఉండి ఉంటే ప్రస్తుత దయనీయ పరిస్థితికి ఎంతగానో పశ్చత్తాప పడి ఉండే వారు.

                        Sadanand Bembre
                           Sr. Journalist
                  Vanchanagiri, Warangal
                         9985871111

The Real hero,.

.
భారత్ నిజమైన స్నేహితుడు..


By Sadanand Bembre

ఇతడి పేరు వాల్డిమిర్_క్రుగ్లయాకొవ్, #మాజీ_USSR 10 Battle గ్రూఫ్ కమాండర్, 1971 భారత్-పాకిస్తాన్ యుధంలొ పాకిస్తాన్ ఓటమి తప్పని పరిస్తులలొ భారత
వ్యతిరేకతను నర నరాన జీర్ణించుకున్న జాత్యహంకార అమెరికన్ డిప్లోమాట్,అరబ్బు లాబీ వారికి దగ్గర సంబందాలున్న అమెరికా రక్షణమంత్రి కిసింజర్ కాళ్ళు పట్టుకున్నాయి. కిసింజర్ రంగంలొకి దిగి అప్పటి అమెరికా అద్యక్షుడు నిక్సన్ పాకిస్తానుకు మద్దత్తుగా భారతదేశం పై దాడి చేయడానికి  అమోదం తెలిపేలా ఓప్పించారు.

ఈ క్రమంలో హెన్రీ కిసింజర్ మాట్లాడుతూ భారత్ ను తీవ్రస్థాయిలొ దూషించాడు కూడా అంతేకాకుండా ఈ యుద్ద సమయంలో బ్రిటన్ కూడా భారత్ పై దాడి చేసేలా బ్రిటన్ ప్రభుత్వాన్ని వొప్పించాడు. ఈ మూర్ఖుడు అంతటితో ఆగకుండా సిద్ధాంత పరమైన విభేదాలున్నప్పటికీ చైనా   మద్దత్తు కూడ తీసుకొవడం కోసం హుటాహుటీన చైనా పర్యటన చేసి చైనా ను కూడా భారత్ కు వ్యతిరేకంగా రణరంగంలోకి దిగేలా ఒప్పించాడు.
వెంటనే అమెరికా, బ్రిటన్ నేవీ లు భారత్ పై దాడి చేయడానికి రంగంలొకి దిగాయి. అమెరికా నుంది అప్పట్లొ అతిపెద్ద విమాన వాహక నౌక #USS_Enterprise (Nuclear) ను, బ్రిటన్ తన విమాన వాహక నౌక #Eagle ను భారత నౌకాశ్రయాలైన, యుధ నౌకలపైన దాడి చేయడానికి రంగంలొకి దింపాయి. చైనా కూడా తన నౌకా దళ్ళాన్ని భారత్ పై దాడి చేయడానికి రంగం సిద్దం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న రష్యా వెంటనే ఈ సమాచారాన్ని దౌత్య మార్గాల ద్వారా  భారత్ కు అందించింది. ఈ పరిస్థితుల నుండి  ఏలాగైనా గట్టెక్కించాలని భారత్ రష్యాని కొరడంతో  వెంటనే రష్యా మన Super Star వాల్డిమిర్ క్రుగ్లయాకొవ్ ను రంగంలొకి దింపింది.
వెంటనే వాల్డిమిర్ క్రుగ్లయాకొవ్ ముందుగా చైనా తీవ్ర హెచ్చరికలు జారీచేశారు "మీరు ఏటువంతి పరిస్తితులలొనైనా భారత్ పై దాడిచేస్తే వెంటనే మానుండి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఏదురౌతుంది, అందులో ఏటువంటి సందేహం లేదు, ఈ విషయంలొ ఏమాత్రం రాజీ పడే ప్రశ్నేలేదు" అని హెచ్చరించడంతొ చైనా భారత్ పై దాడి చేయాలనే తన అలొచనను విరమించుకుంది. ఇక ఈ కమాండర్ వెంటనే వ్లాడివొస్టొక్ నుండి రెండు యుద్ధ నౌకలను, రెండు జలాంతర్గాము(Nuclear) లనుతీసుకుని స్వయంగా రంగంలొకి దిగారు.
ఇతను తెలివిగా Enterprise వెంట ఒక యుధనౌక, జలాంతర్గామి, బ్రిటీష్ ఈగల్ వెనుక ఒక యుధ నౌక, జలాంతర్గామితొ కేవలం 500 మీటర్ల దూరం నుండే వెంబడించడం మొదలు పెట్టాడు, అంతెకాకుండా అమెరికా, బ్రిటన్ నేవీలను మీరు భారత్ పై ఒక్క మిస్సైల్ ఫైర్ చేసిన వెంతనే మేము మీమీద డాడి చేస్తామని హెచ్చరిస్తూ వెంబడించాడు. ఐత ఇతనిని తప్పించుకుని పొవాలని అమెరికన్,బ్రిటన్ నౌకలూ ఏంత ప్రయత్నం చేసినా పట్టు వదలని విక్రమార్కుడి వలే వాటిని అలా దాదాపు 26 రోజుల పాటూ వీటిని వెంబడిస్తూ భారతదేశంపై ఈగ కూడా వాలకుండా కాపాడారు.
ఈ లోపు భారతీయ సేనలు విజయ వంతంగా  పాకిస్తాన్ పీచమణచివేయడంతో పాకిస్తాన్ పూర్తిగా ఒడిపోయి తన ఓటమిని అంగీకరించడంతొ చేసేదేమీ లేక అమెరికా, బ్రిటన్ దేశాలు గర్వభంగంతో అత్యంత అవమాన కరమైన రీతిలో తమ నౌకలను వెనక్కు పిలిచాయి. అవి వెళ్లి పొయిన తరువాత కూడా మరలా తిరిగి వస్తాయేమోనని మరో 20 రొజుల పాటు బంగళా ఖాతం లొనే తిష్టవేసి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడారు.
ఇతనికి మన దేశం ఏప్పటికీ కృతజ్ఞత గా ఉండాలి, ఉంటుంది కూడా...

(మూలం: చిరంజీవి నిమ్మరాజు)