Wednesday, January 27, 2016

షాజీ మహరాజ్ కాలంలోనే మన పూర్వీకుల వలస


By Sadanand Bembre

మనం ఏ కాలంలో ఇక్కడకు వచ్చాం.. ఏ పని మీద వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం అనే విషయంలో మాకు సంపూర్ణంగా అవగాహన ఉంది. మేం మన మిత్రులకు మొదటి నుండి చెబుతూనే వస్తున్నాం.

పూర్వీకులు శివాజీ తండ్రి గారైన షాజీ మహరాజ్ ప్రొద్బలంతోనే ఇక్కడి కి వచ్చి స్థిరపడ్డాం అంతేకాని కొంత మంది పెద్దలు చెబుతున్నట్లు అడుక్కు తినడానికో..భయపడో .. సేవకులుగానో ఇక్కడకు రాలేదు.

వితండవాదం చేసే వారికి చరిత్ర పరిజ్ఞానం శూన్యం. మనం ముమ్మాటికి క్షత్రీయ వర్గం వారమే.. మనం మరాఠా లమన్నది ఎంత నిజమో క్షత్రీయులు అన్నది కూడా అంతే నిజం. కాదని వాదించే వారెవరైనా ఉంటే అది వారి అవగాహన రాహిత్యమే అవుతుంది. అలాంటి వారు మనం క్షత్రీయులు ఎందుకు కాదన్న విషయం నిరూపించగలగాలి. అలాగే భారా మాసే, అక్రుమాసే వైరుధ్యాలు వివరించాలి.

ఈ సమస్యంతా కూడా  మన పూర్వీకుల వలసపై చరిత్రలో నమోదు కాకపోవడం మనకు శాపంగా పరిణమించింది. మనకు లాగే దేశవ్యాప్తంగా అక్కడక్కడా కూడా మన మరాఠా సామాజిక వర్గం ఉంది. వారు కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొంటున్నారు.

మనం చేయాల్సిందల్లా సహేతుకమైన ఆదారాలను సంపాదించి చరిత్రను పునః లిఖించుకోవడమే. అందుకు మరాఠా చరిత్ర పరిశోధకులు, మన మూలాల చరిత్ర పై అవగాహన ఉన్న పెద్దల సహాకారం తీసుకుందాం.

ఈ దిశగా మేం చేస్తున్న కృషి సరైన దిశలోనే కొనసాగుతోందని మాకు లభిస్తున్న ఆధారాలను బట్టి  స్పష్టంగా అవగతమవుతోంది.