కరీంనగర్, ఏప్రిల్ 5: అణు విద్యుత్ కర్మాగారాలకు అత్యంత కీలకమైన ఇంధన వనరైన యురేనియం నిలువలు జిల్లాలో వెలుగులోకి వచ్చా యి. 2023 నాటికి దేశంలో రెండు గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ దిశగా అణు విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విష యం తెలిసిందే. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్‌లోని కోక్రాఫర్‌లలో 1400 మెగావాట్ల అణు విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
అంతకుముందు తమిళనాడులోని కుడంకులం అణు విద్యుత్ కర్మాగారాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అణు విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే అణు (రేడియో) ధార్మిక మూలకాల్లో ప్రధానమైన ఇంధనాలుగా గుర్తింపు పొందిన యురేనియం, థోరియం ఇంధనాల కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తుండడంతో భారత అణు ఇంధన సంస్థ నేతృత్వంలోని ఆటమిక్ మైనింగ్ డైరెక్టరేట్ పర్యవేక్షణలో 2006 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేడియో ధార్మిక మూలకాల కోసం అనే్వషణ కొనసాగిస్తోంది. సగటున 220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 45 టన్నుల యురేనియం అవసరమవుతోంది. అంతేకాకుండా విద్యుత్ ఉత్పాదక వ్యయం కూడా భారీగా తగ్గే పరిస్థితులుండడంతో అణు విద్యుత్ ఉత్పాదనలో కీలకమైన ఇందన వనరుగా ఉపయోగపడుతున్న యురేనియం వెలికితీతకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే చొప్పదండి మండలం భూపాలపట్నం, కొత్తూర్, పెద్దూర్ గ్రామాల పరిధిలో పెద్దఎత్తున యురేనియం నిలువలను కనుగొన్నట్లు గనుల శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కడప జిల్లా తుమ్మలపల్లి, నల్లగొండ జిల్లా పెద్ద అడిచెర్లపల్లి, లంబాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధిక యురేనియం డిపాజిట్లను కనుగొన్నారు. తుమ్మలపల్లి ప్రాజెక్టు పరిధిలో సుమారు 160 కిలోమీటర్ల నిడివిలో 400 మీటర్ల లోతు వరకు యురేనియం లభ్యమయ్యే అవకాశమున్నట్లు ఆటమిక్ మినరల్ డైరెక్టరేట్ నిర్ధారించింది. ఇక్కడ సుమారు 49 వేల టన్నుల యురేనియం లభ్యం కావచ్చని భావిస్తుండగా నల్లగొండ జిల్లా పెద్దఅడిచెర్లపల్లి పరిధిలో కూడా సుమారు 1800 టన్నులకు పైగా యురేనియం లభ్యం కావచ్చని అంచనా వేశారు. ఇక కరీంనగర్ జిల్లా విషయానికొస్తే యురేనియం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయం పూర్తిగా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఇక్కడ వెలుగు చూసిన యురేనియం ప్రధానంగా 1.96 ట్రై యురేనియం ఆక్టోసైడ్ యు-308 రకానికి చెందిందిగా నిర్ధారించారు. తవ్వకాల కోసం యుసిఐఎల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.