Saturday, January 9, 2016

కీలెరిగి వాత.. అదే మోడి మంత్ర..


కీలెరిగి వాత...
అదే మోడి మంత్ర...

By Sadanand Bembre

ఒకరి అవసరాలను మన దేశప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవడమే అసలు సిసలు దౌత్యనీతి. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గతంలో ఏ ప్రధానికి సాధ్యం కాని అసాధ్యాలను నరేంద్ర మోడి సుసాధ్యం చేసి చూపుతున్నారు. దశాబ్దాల పాటు భ్రష్టు పట్టి పోయిన విదేశీ సంబందాలను తనదైన పంథాలో గాడిలో పెడుతూ అగ్రరాజ్యాలను అశ్చర్యానికి గురి చేస్తున్నారు.

మోడీ వ్యవహర శైలి స్వదేశంలో ప్రధాన ప్రతిపక్షాలను, స్వపక్షంలో ఉన్న విపక్షాన్ని మెప్పించలేకపోయినా.. వ్యూహాత్మక అంశాలపై భారత్ దౌత్య నీతి పదును తేలిందనే సంకేతాలను ప్రపంచ దేశాలకు పంపడంలో  ఆయన ఇప్పటికే ఘన విజయం సాధించాడు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు భారత్ ను చిన్న చూపు చూసిన దేశాలన్నీ కూడా ఇండియాతో సంబంధాలను సరిచేసుకోక తప్పని అనివార్య స్థితిని సృష్టించడమే మోడి సాధించిన మొదటి దౌత్య విజయమని చెప్పవచ్చు.

వెనకటి వెన్నెముక లేని ప్రభుత్వాల నిర్వాకం ఫలితంగా భారత వ్యూహాత్మక రక్షణ విధానం కూడా దారుణంగా దెబ్బతింది. ఈ కారణంగానే శ్రీలంక, నేపాల్, మాల్దీవులు వంటి దేశాలు కూడా చైనాకు దగ్గరయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ కారణంగానే మోడీ వ్యూహాత్మకంగా ప్రదాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ఉపఖండంలోని దేశాల అధినేతలను అహ్వానించినప్పుడే ఆయన ఏ ఉద్దేశ్యంతో ఉన్నారో ప్రపంచ దేశాలకు అర్థమయ్యింది. ఈ క్రమంలోనే నిన్నటి దాక పట్టించుకోనట్లు నటించిన దేశాలు అన్ని తమ వైఖరులను విడనాడే పరిస్థితులు సృష్టించారు.

మోడిని ప్రసన్నం చేసుకోవడం ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు అవసరం గనుక పొగుడుతున్నారు. ఇదే నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అన్ని కూడ బలుక్కున్నట్లు మత తత్వ వాదిగా ముద్ర వేసి తమ దేశాలకు రాకుండా నిషేధం విదించడం అప్పుడే ఎలా మర్చిపోగలం? హఠాత్తుగా వారు తమ వ్యూహం మార్చుకోవడానికి వారి స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడానికే కాని మోడిపై అభిమానంతో ఎంత మాత్రం కాదు. చైనాను కట్టడి చేయడం కోసం అమెరికా, ఐరోపా పెద్దన్న రష్యా ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ లాంటి పెద్ద రాజ్యంతో చెలిమి అవసరం.
అదీ కాకుండా ప్రపంచం మొత్తంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా భారత్ మాత్రమే. డొమెస్టిక్ క్రైసిస్ తో కూనారిల్లిపోయిన అమెరికన్ అర్థిక వ్యవస్థకు అర్థికంగా దన్నును ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు మార్కెట్ అవసరాల పరంగా భారత్ మాత్రమే దానికి కనిపిస్తున్న ఏకైక ఆశాకిరణం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద అర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా మార్కెటింగ్ పరంగా భారత్ కంటే పెద్దదే అయినా అది దిగుమతి చేసుకునే పరిస్థితులు అసలే లేవు. అంతేకాకుండా చౌక వస్తువులు ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద ఎగుమతి దారుగా ఆవిర్భవించింది. అలాగే ప్రపంచం మొత్తం మీద అత్యధిక డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వలు కలిగి ఉండటం.. సోషలిస్టు దేశం కావడం వంటి అంశాలు అమెరికన్ పాలకులకు కలవరపెడుతున్న కారణంగా బౌగోళికంగా చైనాకు పొరుగునే ఉన్న భారత్ కు కూడా దానితో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల అమెరికా వ్యూహాత్మక విధానాలలో భాగంగానే ఇండియాతో చెలిమికి అరాటపడుతోంది.

అదీ కాకుండా సోవియట్ పతనం తర్వాత కుప్పకూలిపోయిన అవశేష రష్యా వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో పూర్వ వైభవం సంతరించుకునే దిశగా ప్రస్థానిస్తుండటం కూడా అమెరికన్ పాలకులకు కంటగింపు కలిగించే విషయం.  దురాక్రమణ నెపంతో రష్యాపై అంక్షలు విదించి అర్థికంగా చక్రబంధంలో ఇరికించడం ద్వారా తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు వ్యూహం రచించింది. ఈ క్రమంలో రష్యా ఉత్పత్తి చేస్తున్న చమురును కొనుగోలు చేయకుండా అడ్డుకుంటోంది.

అయితే అమెరికాతో కంటే రష్యాతోనే భారత్ బలమైన సంబంధం కలిగి ఉన్నందున దాన్నుండి దూరం చేసేందుకు వ్యూహాత్మకంగా భారత్ కు తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు నటిస్తోందంతే.

ఏవరీ మరాఠా (ఆరె) క్షత్రీయ..!?


ఆరె మరాఠా సామాజిక వర్గం- చారిత్రక నేపథ్యం..


By Sadanand Bembre

మహోజ్వల భారత చరిత్రలో మరాఠాల చరిత్ర ఎంతో ప్రాశస్త్యం మరియు విశిష్టమైనది. జన్మతః రాజపుత్ర ( బ్రహ్మణ), ధర్మతః క్షత్రీయ, వృత్తి రీత్యా వ్యవసాయ నిపుణులు.. ఈ లక్షణాలే  హైందవ సమాజంలో మరాఠాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.  అంతే కాదు మెజారిటీ ప్రజలై ఉండి కూడా తమకంటూ ఒక రాజ్యం లేక మొగలాయి చక్రవర్తుల పాలన కింద దిక్కూ.. మొక్కూ లేకుండా బ్రతుకులీడుస్తున్న హైందవ సమాజానికి ఒక ఉనికినిచ్చి మాకూ ఓ రాజ్యముందీ అని గర్వంగా చెప్పుకునేలా హిందూ సామ్రాజ్య స్థాపన ఒక్క మరాఠాల వల్ల మాత్రమే సాకారమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడైనా మరాఠాలను ప్రస్తావించే సందర్భాల్లో వీర్ మరాఠా అన్న విశేషణాన్ని జతచేసి సంభోదిస్తారు. 
ఇక మరాఠా అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది చత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. నిజమే కాని అంతకు ముందు కూడా మనకు ఘనమైన చారిత్రిక వారసత్వం ఉంది. ప్రపంచానికి చెరుకు పంటను పరిచయం చేసింది మరాఠాలే. అదేంటి ఓ వైపు క్షత్రీయులు అంటూనే మరోవైపు వ్యవసాయ నిపుణులు అంటున్నారేమిటన్న సందేహాలు కలగొచ్చు. మరాఠీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు యుద్ధ సమయాల్లో సైనికులుగా.. యుద్ధ విరామ సమయాల్లో రైతులుగా వ్యవసాయం చేసుకునే తమ కుటుంభాలను పోషించుకునే వారు. (ఇప్పటికీ మరాఠా సామాజిక వర్గం అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో వ్యవసాయం చేసుకునే జీవనం సాగించడం గమనించాల్సిన విషయం.) శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపన యజ్ఞంలో భాగస్వామి కావడం ప్రతీ మరాఠా తన పవిత్రమైన కర్తవ్యంగా భావించారు కాబట్టే శివాజీ ఆనాడు విజయవంతంగా హైందవ సామ్రాజ్య స్థాపన చేయగలిగారు. 
అంతకు ముందు ఎంత మంది హిందూ రాజులు లేరు..వారికి సాధ్యం కాని హిందూ రాజ్య స్థాపన శివాజీ మాత్రమే ఏలా చేయగలిగారు? శివాజీ కంటే ముందు గొప్ప హిందూమత అభిమానం కలిగిన రాజపుత్ర వీరుడు రాణా ప్రతాప్ సింగ్ కు కూడా ఎందుకు సాధ్యం కాలేదు?. ఎందుకంటే వారెవరూ కూడా శివాజీ లాగ  తమ లక్ష్య సాధనలో ప్రజలను మమేకపర్చలేకపోయారు. ఆ పనిని శివాజీ చేయగలిగారు కాబట్టే ఆయన యుగ పురుషుడయ్యారు.. 

ఆరె/ మరాఠా/ ఆర్య క్షత్రీయ..

ఇంతకు మనం ఏవరం? ఆరె వాళ్లమా..!? మరాఠీలమా..!? లేక ఆర్యక్షత్రీయులమా..!? ఏది వాస్తవం..? అసలు ఆరె అంటే ఏమిటి? అది కులమా లేక జాతి పేరా? ఇలాంటి సందేహాలెన్నో మన మరాఠా సోదరులకున్నాయి. పోయిన తరానికి మనమెవరమో తెలుసు.. కాని ఎక్కడి నుండి వచ్చామో .. ఎందుకొచ్చామో తెలియనివారు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి "ఆరె" అనేది ఒక కులం పేరు కాదు. " ఆరె" అంటే ఉర్ధూ భాషలో "వచ్చిన వారు" అని అర్థం.  అవిభాజ్య హైదరాబాద్ రాజ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలోని మరట్వాడ ప్రాంతంతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలైన బీదర్ , రాయచూర్ , బీజాపూర్, యాద్గీర్ వంటి ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి. అప్పట్లో నిజాం తన పాలనా పరమైన అవసరాలకు మరాఠీ సామాజిక వర్గానికి చెందిన వారిని పాటిల్స్ గా, పట్వారీలుగా, వతన్ దారులుగా, పోలీస్ పాటిల్స్ గా నియమించుకునేవారు. ఇప్పటికీ మరాఠా వారిని "ఆరె పటేల్" అనే  సంభోధిస్తుండటాన్ని గమనించవచ్చు. కాబట్టి ఉద్యోగాల రీత్యా ఈ ప్రాంతానికి వలసలు విస్తృతంగా జరిగాయి. 
హైదరాబాదు రాష్ట్రంలో ఉర్ధూ అధికార భాషగా కొనసాగింది కాబట్టి.. అధికారిక వ్యవహారాల సందర్భంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి మరాఠీ అధికారులను గుర్తించడం కోసం ఆరె పటేల్ అని సంభోదించేవారు. అలా ఆరె అనే పదం స్థిరపడి మరాఠా కు పర్యాయ పదంగా పరిణామం చెందింది. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో మాత్రం మొదటి నుండి వారిని మరాఠీలుగానే వ్యవహరిస్తున్నారు..వారి ఉనికికి గుర్తింపు కూడా మరాఠాలు గానే కొనసాగింది.
 ఎటొచ్చి తెలంగాణా ప్రాంతంలో మాత్రమే గందరగోళం. కర్ణుడి చావుకు నూటొక్క కారణాలన్న ట్లు..  ఇక్కడ ఆరె, ఆరోళ్లు, ఆరె వాండ్లు, ఆరె పటేండ్లు, ఆర్య క్షత్రీయ, ఆరె మరాఠా అనే పేర్లతో పిలవడం ఒక కారణమైతే.. ఆ విద్య.. ఐక్యత కొరవడటం ఈ ప్రాంతంలో ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. 
అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో మన ప్రజలను వ్యవహారికంగా ఆరె పటేల్ అని సంభోధించటం వల్ల 1990 వ దశకంలో ఈ వర్గం సామాజిక నిర్మాణం పై సరైన అవగాహన లేని ఓ తహసిల్దార్ అప్పట్లో తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ప్రస్తుత దయనీయ పరిస్థితికి కారణం.



ఆర్య క్షత్రీయ

ఆర్య+క్షత్రియ= ఆర్య క్షత్రియ

సంస్కృతంలో ఆర్య అంటే గొప్ప అని అర్థం. ఆర్య క్షత్రియ అంటే గొప్ప క్షత్రీయుడు అని అర్థం. 

మరాఠా అంటే ఏమిటి..?

అసలు మరాఠా అంటే అర్థం ఏమిటి? ఇది చాలామంది మదిని తొలుస్తున్న ప్రశ్న. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 99% మంది ప్రజలకు దీని అర్థం తెలియదు. 
మర్+హఠ= మరాఠా
అంటే మరణాన్ని జయించినవాడు/ అధిగమించినవాడు/ మరణానికి ఎదురునిలిచి పోరాడే వాడు... వీరుడు అని అర్థం. 


Thursday, July 16, 2015

REVENUE , FOREST TUG OF WAR OVER DISPUTED LANDSSADANAND BEMBRE
KARIMNAGAR, JUNE 25:
Land Controversy between Revenue and Forest departments creating troubles to poor farmers who are cultivating those lands for time being. Sometimes officials registering cases on them.   Disputes between two departments creating nuisance  to beneficiaries who possessed official documents  of the lands from government as a part of land distribution. In the district about 12396.36 acres of land is  in dispute which covers 67 villages of 18 mandals .from the last 10 years dispute was settled in only one village in remaining districts disputes are not yet solved. Even though special officer deputed for survey of disputed lands could not shown solution. It is become common phenomenon of registering cases on farmers in the name of encroachment by forest officials. Some farmers says they are cultivating their own lands allotted under land distribution scheme. Some revolutionary party leaders demanding allocation of lands to poor who are on possession.  All these making the issue more complicated. Taking the mess as advantage middlemen collection money farmers in the name of procuring land documents on farmers name. utilizing the opportunity few are  issuing documents to the farmers showing forest lands as revenue lands. Land disputes between reverence and forest are high in Manthani and Peddapally revenue divisions followed by Karimnagar and Sircilla divisions. Highest disputed lands about 5949.02 acres are located in Manthani division covering Kamanpur,Kataram,Mahadevpur,Manthani,Muttaram and Malhar mandals.  In Peddapally division about 4275.02 acres under dispute between two departments which covers Peddapally,Velagatur,srirampur mandals. meanwhile  In karimnagar and siricilla divisions about 2000 acres land under dispute due to lack of co ordination between Revenue and Forest departments. The main reason for disputes is forest  department not showing it’s lands boundaries where as Revenue department do not have Gazette notification with them about disputed lands. In jagityala division also there are differences between two departments. one side Revenue department issuing land declaration certificates to poor in disputed lands. On the other hand forest officials filing cases on farmers in the name of encroachments. Farmers are demanding Ministers intervention to solve the problem permanently. 

Tuesday, March 5, 2013

ప్రాణం తీసిన ‘ట్రాఫిక్’


  • 05/03/2013
కరీంనగర్, మార్చి 4: ట్రాఫిక్ జామ్ కారణంగా వైద్య సహాయం అందక ఓ మహిళ మఠణించింది. కరీంనగర్ జిల్లా కాసింపేటకు చెందిన బొజ్జ కోంరవ్వ (65)కు గుండె నొప్పి రావడంతో వైద్యం కోసం కరీంనగర్ తీసుకొస్తున్నారు.నగర శివారులోని మానేరు వంతెన వద్ద ఓ లారీ రోడ్డు టైరు పేలి మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయంది. దీంతో అల్గునూర్ చౌరస్తా నుండి నగరంలోకి ప్రవేశించేందుకు వేరే మార్గం లేకపోవడంతో అప్పటికే అపస్మారక స్థితికి చేరిన మహిళ చనిపోయంది. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి ఉంటే ఓ నిండు ప్రాణం నిలబడేదని కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.




















Saturday, July 14, 2012

తెలంగాణా ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు

 
 తెలంగాణా రాష్ట్రంలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో ప్రకటించారు. తెలంగాణా ఏర్పాటుపై తనకు కాంగ్రెస్ హై కమాండ్ నుండి స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు అయన వెల్లడించారు.

Friday, April 6, 2012

కరీంనగర్ జిల్లాలోనూ యురేనియం నిక్షేపాలు

కరీంనగర్, ఏప్రిల్ 5: అణు విద్యుత్ కర్మాగారాలకు అత్యంత కీలకమైన ఇంధన వనరైన యురేనియం నిలువలు జిల్లాలో వెలుగులోకి వచ్చా యి. 2023 నాటికి దేశంలో రెండు గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ దిశగా అణు విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విష యం తెలిసిందే. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్‌లోని కోక్రాఫర్‌లలో 1400 మెగావాట్ల అణు విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
అంతకుముందు తమిళనాడులోని కుడంకులం అణు విద్యుత్ కర్మాగారాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అణు విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే అణు (రేడియో) ధార్మిక మూలకాల్లో ప్రధానమైన ఇంధనాలుగా గుర్తింపు పొందిన యురేనియం, థోరియం ఇంధనాల కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తుండడంతో భారత అణు ఇంధన సంస్థ నేతృత్వంలోని ఆటమిక్ మైనింగ్ డైరెక్టరేట్ పర్యవేక్షణలో 2006 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేడియో ధార్మిక మూలకాల కోసం అనే్వషణ కొనసాగిస్తోంది. సగటున 220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 45 టన్నుల యురేనియం అవసరమవుతోంది. అంతేకాకుండా విద్యుత్ ఉత్పాదక వ్యయం కూడా భారీగా తగ్గే పరిస్థితులుండడంతో అణు విద్యుత్ ఉత్పాదనలో కీలకమైన ఇందన వనరుగా ఉపయోగపడుతున్న యురేనియం వెలికితీతకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే చొప్పదండి మండలం భూపాలపట్నం, కొత్తూర్, పెద్దూర్ గ్రామాల పరిధిలో పెద్దఎత్తున యురేనియం నిలువలను కనుగొన్నట్లు గనుల శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కడప జిల్లా తుమ్మలపల్లి, నల్లగొండ జిల్లా పెద్ద అడిచెర్లపల్లి, లంబాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధిక యురేనియం డిపాజిట్లను కనుగొన్నారు. తుమ్మలపల్లి ప్రాజెక్టు పరిధిలో సుమారు 160 కిలోమీటర్ల నిడివిలో 400 మీటర్ల లోతు వరకు యురేనియం లభ్యమయ్యే అవకాశమున్నట్లు ఆటమిక్ మినరల్ డైరెక్టరేట్ నిర్ధారించింది. ఇక్కడ సుమారు 49 వేల టన్నుల యురేనియం లభ్యం కావచ్చని భావిస్తుండగా నల్లగొండ జిల్లా పెద్దఅడిచెర్లపల్లి పరిధిలో కూడా సుమారు 1800 టన్నులకు పైగా యురేనియం లభ్యం కావచ్చని అంచనా వేశారు. ఇక కరీంనగర్ జిల్లా విషయానికొస్తే యురేనియం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయం పూర్తిగా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఇక్కడ వెలుగు చూసిన యురేనియం ప్రధానంగా 1.96 ట్రై యురేనియం ఆక్టోసైడ్ యు-308 రకానికి చెందిందిగా నిర్ధారించారు. తవ్వకాల కోసం యుసిఐఎల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.