ప్రాణం తీసిన ‘ట్రాఫిక్’
- 05/03/2013
కరీంనగర్, మార్చి 4: ట్రాఫిక్ జామ్ కారణంగా వైద్య సహాయం అందక ఓ మహిళ మఠణించింది.
కరీంనగర్ జిల్లా కాసింపేటకు చెందిన బొజ్జ కోంరవ్వ (65)కు గుండె నొప్పి రావడంతో
వైద్యం కోసం కరీంనగర్ తీసుకొస్తున్నారు.నగర శివారులోని మానేరు వంతెన వద్ద ఓ లారీ
రోడ్డు టైరు పేలి మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయంది. దీంతో అల్గునూర్
చౌరస్తా నుండి నగరంలోకి ప్రవేశించేందుకు వేరే మార్గం లేకపోవడంతో అప్పటికే అపస్మారక
స్థితికి చేరిన మహిళ చనిపోయంది. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి ట్రాఫిక్‌ను
క్లియర్ చేసి ఉంటే ఓ నిండు ప్రాణం నిలబడేదని కుటుంబ సభ్యులు కన్నీళ్ల
పర్యంతమయ్యారు.
No comments:
Post a Comment