Saturday, December 24, 2011

ఖద్దర్..కాంట్రాక్టర్ చెట్టపట్టాల్..!

* కోట్లు కొల్లగొడుతున్న ఇసుక మాఫియా

 * ప్రజాప్రతినిధుల అనుచరులదే కీలక పాత్ర

 * అధికారులకూ నెల నెల మామూళ్లు

 * ఇందిరమ్మ పేరుతో రాజధానికి లారీల తరలింపు

ఆంధ్ర భూమి బ్యూరో
-----------------------

కరీంనగర్, డిసెంబర్ 20: ఖద్దర్ చొక్కాలు, కాంట్రాక్టర్‌లు కూడబలుక్కుంటే ఎలా ఆర్జించవచ్చో..ఇసుక మాఫియాను చూసి ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ఇసుకేస్తే కాసులు రాలుతుండడంతో ఇసుక క్వారీలు మాఫియాకు బంగారు గనులుగా మారిపోయాయి. అధికారికంగా కొంత, అనధికారికంగా కొండంత అన్నట్లుగా రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్లు అధికారులను నయానో, భయానో గుప్పిట్లో పెట్టుకొని యదేశ్ఛగా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన వేలం పాటల్లో తొమ్మిది ఇసుక రీచ్‌లకు సంబంధించి పది కోట్లకు పైనే ఆదాయం లభించింది. అయితే టెండర్లలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో అక్రమాలు జరిగాయంటూ కొంత మంది వ్యాపారులు హైకోర్టుకెక్కారు. దాంతో అక్కడ తవ్వకాలకు అధికారికంగా బ్రేక్ పడింది. ఇవి కాకుండా వెల్గటూరు మండలం ముత్తునూరు, ముక్కట్రావుపేట, రామగుండం మండలం పొట్యాల రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తవ్వేందుకు అనుమతించారు. జిల్లాలో ప్రస్తుతం అధికారిక ఇసుక క్వారీలు ఈ రెండు మాత్రమే. కానీ హైకోర్టు బ్రేక్ వేసిన తొమ్మిది రీచ్‌ల్లో ప్రధానమైన రీచ్‌గా భావిస్తున్న కొదురుపాక రీచ్ నుండి ఇప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరులు యదేశ్ఛగా ప్రోక్లైన్లు పెట్టి మరీ ఇసుకను వందలాది లారీల్లో ప్రతీ రోజు రాజధానికి తరలిస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన తరువాత ఒక్కో లారీ ఇసుకకు సగటున 15 వేల నుంచి 18 వేల రూపాయల మధ్య వసూలు చేస్తారు. అలాగే స్థానికంగా ఇసుక ట్రాక్టర్ల చొప్పున విక్రయించడం జరుగుతుంది. ఒక్కో ట్రాక్టర్‌కు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల మధ్య ఇసుక నాణ్యతను బట్టి వసూలు చేస్తారు. ఇలా జిల్లాలోని మానేరు, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వందలాది అనధికారిక ఇసుక రీచ్‌ల నుంచి లారీల్లో తరలిస్తున్నా అధికారులు కనీస చర్యలు చేపట్టలేని ధైన్య స్థితిలో ఉన్నారు. కళ్ల ముందు నుండి లారీలు తరలివెళ్తున్నా పట్టించుకోవడం లేదంటే ఇసుక మాఫియా అధికార యంత్రాంగాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో ఊహించవచ్చు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇసుక మాఫియా ప్రతీ నెలా గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లా ఉన్నతాధికారి వరకు, కానిస్టేబుల్ మొదలుకొని పోలీస్ ఉన్నతాధికారుల వరకు లక్షల్లో మామూళ్లు ముట్టచెబుతూ పని చక్కబెట్టుకుంటున్నారనేది నగ్న సత్యం.
మాఫియాకు కాసులు కురిపిస్తున్న రియల్ భూం..

నాలుగేళ్ల క్రితం వరకు ఇసుక దందాపై జిల్లాలో పెద్దగా ఎవరికి అవగాహన ఉండేది కాదు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భూం మొదలైన తరువాత భవన నిర్మాణాలు పెద్దఎత్తున ప్రారంభం కావడంతో హైదరాబాద్‌కు చెందిన ఇసుక వ్యాపారులు కరీంనగర్ జిల్లాపై దృష్టి సారించడంతో దీని వెనుక సాగుతున్న ఆర్థిక లావాదేవీలపై జిల్లా నేతలు దృష్టి సారించారు. ఈ వ్యాపారంలో కోట్ల పంట పండుతోందనే విషయాన్ని పసిగట్టడంతో ఏడాది క్రితం నిర్వహించిన వేలం పాటల్లో నేరుగా తమ అనుచరుల పేరుతో ఇసుక దందాలోకి అడుగుపెట్టారు. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి అనుచరులే ఇసుక మాఫియాకి శ్రీకారం చుట్టారు. వేలం పాటల్లో కొన్ని రీచ్‌ల్లో వీరికి టెండర్లు దక్కినప్పటికీ హైకోర్టు ఉత్తర్వుల పుణ్యమా అని బ్రేక్ పడడంతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. దాంతో జిల్లాలో అనధికారికంగా వందకు పైగా రీచ్‌ల నుంచి యథేచ్ఛా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో రాజకీయంగా ఘర్షణలు తలెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయా సందర్భాల్లో ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు, పోలీస్ సిబ్బంది ఆ మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయను చూసి మనకెందులే అన్న నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు.
రూల్స్..గీల్స్ జాన్తానై..

జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతి లేదు. అత్యవసరం కింద ఇందిరమ్మ గృహాలకు, గ్రామాల్లో ఇళ్లు కట్టుకునే వారికి అధికారులు అనుమతిస్తారు. దానికనుగుణంగా ఇసుకను తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతిచ్చిన క్వారీలు జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో వెల్గటూర్ మండలంలో ముత్తునూర్. ముక్కట్రావ్‌పేట , రామగుండం మండలంలో పొట్యాల ఒకటి ఇసుక క్వారీలు ఉన్నాయి. వీటి ద్వారా మాత్రమే ఇసుకను తరలించాలి. దానికి అధికారులు అనుమతి ఇస్తారు. మిగితా చోట్ల ఇసుక తరలింపునకు అనుమతులు లేవు. కానీ జిల్లాలోని ఇల్లంతకుంట మండలం మల్లాపూర్ కొత్త బ్రిడ్జి వద్ద ఇష్టం వచ్చిన రీతిలో ఇసుకను తోడేస్తున్నారు. అలాగే బోయినపల్లి మండలం మాన్వాడ, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, మంథని, మహదేవ్‌పూర్, జమ్మికుంట మండలం వావిలాల, వీణవంక వద్ద ఉన్న మానేరు నుండి ఈ ఇసుక తరలింపును చేస్తున్నారు. అలాగే కరీంనగర్ నగర శివారు నుంచి కూడా పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. రెవెన్యూ, పంచాయతీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు, ఉద్యోగుల సహకారంతో మాఫియా ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుతూ యదేశ్ఛగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. గత నలబై రోజులుగా పెద్దఎత్తున జరుగుతున్న ఈ దందాలో వందలాది లారీలు హైదరాబాద్‌కు తరలిపోయాయి. జిల్లాలోని పలుచోట్ల నుండి కళ్లముందే ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో అక్రమంగా ఇసుక తరలించే లారీలను, ట్రాక్టర్లను సీజ్ చేసి 5వేల నుంచి 15వేల వరకు జరిమానా వేసేవారు. ట్రాక్టర్స్, లారీలను సీజ్ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అక్రమార్కులు వందలాది లారీల ఇసుకను తరలించి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందాలో వచ్చిన డబ్బుల్లోంచి కొంత శాతం అధికార పార్టీ నేతలకు రాయల్టీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. అదేకాకుండా ఆయా గ్రామాల పరిదిలో ఇసుకను తీసినప్పుడు అడ్డుకోకుండా ఉండేందుకుగాను గ్రామాల్లోని ప్రజాప్రతినిధులకు కూడా కొంత ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఇసుకను తోడేందుకు జెసిబిలను వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని అరికట్టకపోతే భూగర్భ జలాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

ఇసుక తీస్తే ఇక ఉక్కుపాదమే!

* ‘్భమి’ కథనాలతో అధికారుల్లో కదలిక * అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు * జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు * నిఘాకోసం ప్రత్యేక బృందాలు * నేడో, రేపో విడిసిలపైనా కేసులు * వెల్లడించిన జాయింట్ కలెక్టర్


కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇసుక అక్రమమైనింగ్‌కు ప్రధానంగా అధికారిక వేలం పాటలు నిర్వహించకపోవడమే కారణమని భావించి అనుమతికోసం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేందుకు నిర

ఇసుక తీస్తే ఇక ఉక్కుపాదమే!

* ‘భూమి’ కథనాలతో అధికారుల్లో కదలిక
* అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు
* జిల్లా వ్యాప్తంగా 19 మందిపై క్రిమినల్ కేసులు
* నిఘాకోసం ప్రత్యేక బృందాలు
* నేడో, రేపో విడిసిలపైనా కేసులు
* వెల్లడించిన జాయింట్ కలెక్టర్
 
-ఆంధ్రభూమి బ్యూరో
 

కరీంనగర్, డిసెంబర్ 23: జిల్లాలో ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదులైన గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘ఆంధ్రభూమి’ ప్రచురించిన వరుస కథనాలతో అధికారుల్లో చలనం మొదలైంది. దాంతో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, ధర్మపురి వంటి ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి 14 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా వాటి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా మోపారు. అలాగే జమ్మికుంట మండలంలోని రెండు ర్యాంప్‌ల నుంచి ఇసుకను తరలిస్తున్న మరో ఐదు వాహనాలను రెవెన్యూ సిబ్బంది దాడులు జరిపి పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై ఎపి వాల్టా చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాయికల్ మండలం కొత్తపేట, బోర్నపల్లి, మల్లాపూర్ మండలం వివిరావుపేట, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో విడిసిలు వేళం వేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. అయితే వేలంలో ర్యాంపులు దక్కించుకున్న అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు. వారంతా కూడా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పాయింట్లలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇకపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక మైనింగ్‌కు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సంబంధించిన వాహనాలు పట్టుబడితే వాటిని సీజ్ చేయడంతో పాటు పెద్దమొత్తంలో జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు మొదటిసారి పట్టుబడితే ఎనిమిది వేలు, రెండవ సారి పట్టుబడితే పది వేల చొప్పున, లారీలు మొదటిసారి పట్టుబడితే 20 వేలు, రెండవసారి పట్టుబడితే అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అక్రమ రవాణా నిరోధానికి తహశీల్దార్‌లు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత ఎస్‌ఐలకు వాహనాలను సీజ్ చేసే అధికారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇసుక అక్రమమైనింగ్‌కు ప్రధానంగా అధికారిక వేలం పాటలు నిర్వహించకపోవడమే కారణమని భావించి అనుమతికోసం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేందుకు నిర్ణయించారు.

Saturday, December 17, 2011

కదులుతున్న ‘ఎక్సైజ్ ఎస్టీఎఫ్’డొంక


కరీంనగర్, డిసెంబర్ 16: కరీంనగర్ జిల్లాలో జరిగిన ఎసిబి దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటుకు చెందిన ‘ప్రత్యేక నిఘా విభాగం’ (ఎస్టీఎఫ్) అధికారులు పట్టుబడడంతో తీగ లాగిన ఎసిబికి రాష్టవ్య్రాప్తంగా ఉన్న డొంకలన్నీ కదలడం ప్రారంభించాయి. ఈ నెల 13న ఎస్టీఎఫ్ సిబ్బంది అవినీతిపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎసిబి అధికారులకు ఓ ఉన్నతాధికారికి చెందిన లాప్‌టాప్ లభించింది. దాన్ని డీకోడింగ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్ల నుంచి రావాల్సిన మామూళ్లకు సంబంధించిన పూర్తి జమా, ఖర్చు పద్దుల చిట్టా బట్టబయలైంది. దాంతో ఈ నెల 13న హైదరాబాద్ ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు కరీంనగర్ జిల్లాలో మెరుపు దాడులు జరిపారు. దాడుల్లో మూడు లక్షల 72 వేల నగదు లభ్యమైంది. విచారణలో ఆ అధికారులు ఇచ్చిన సమాచారంతో అదే రోజు రాత్రి కరీంనగర్ సిండికేట్ కార్యాలయంపై దాడులు నిర్వహించి లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్‌డిస్ట్‌లను స్వాధీనం చేసుకొని సమాచారాన్ని సేకరించింది. కోట్లాది రూపాయలు ముడుపుల రూపంలో చేతులు మారుతున్నాయన్న విషయం తేటతెల్లం కావడంతో వెంటనే అప్రమత్తమై శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా మద్యం సిండికేట్ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఎసిబి అధికారులకు దిమ్మదిరిగిపోయే సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని మిగతా సిండికేట్లు, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతాల్లోని సిండికేట్ కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో లభ్యమైన వివరాల ఆధారంగా అవినీతికి సంబంధించి మరింత కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. లాప్‌టాప్, సిండికేట్స్ రికార్డుల్లో లభ్యమైన సమాచారం ఆధారంగాప్రధానంగా ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ విభాగాలతో పాటు కొంత మంది పాత్రికేయుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను సమాచారం కోరగా దీంతో ప్రమేయం ఉన్న అధికారులపై విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.

Friday, December 2, 2011

రెవెన్యూలో బది‘లీల’లు..

* కాసులిచ్చుకున్న వారికి కోరుకున్న పోస్టింగ్‌లు? * దళిత అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు! * అసంతృప్తితో రగులుతున్న డిప్యూటీ తహశీల్దార్లు

కరీంనగర్, నవంబర్ 29: కక్షసాధింపులో రెవెన్యూ శాఖ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇటీవల రెండు దఫాలుగా జరిగిన తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్ల బదిలీల ప్రహనంలో రెండవ దఫా జరిగిన బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. కాసులిచ్చుకున్న వారికే వారు కోరుకున్న పోస్టింగ్‌లు ఇచ్చి దళిత, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు కట్టబెట్టారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఇంకా 19 డిప్యూటీ తహశీల్దార్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి పొందిన అభ్యర్థులకు వారు పని చేసిన చోటే పోస్టింగ్‌లు ఇవ్వడం ఈ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ కాసుల తతంగంలో రెవెన్యూలోని కలెక్టరేట్ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒక్కో డిప్యూటీ తహశీల్దార్ నుంచి లక్ష రూపాయలు మొదలుకొని మూడు లక్షల వరకు మామూళ్లు పుచ్చుకొని వారికి అనువైన పోస్టింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా పగ్గాలు చేపట్టిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో 24 మంది తహశీల్దార్లు, 27 మంది డిప్యూటీ తహశీల్దార్లు స్థాన భ్రంశం కల్పించి సంచలనం సృష్టించారు. అప్పట్లో ఈ బదిలీలపై కించిత్ కూడా అసంతృప్తి కన్పించలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. ఆ 24 మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు సుదీర్ఘకాలం అదే చోట పని చేయడంతో పాటు స్వస్థలాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు. దాంతో కలెక్టర్ వారిపై బదిలీ వేటు వేయడం పట్ల రెవెన్యూలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతేకాకుండా ప్రజల నుండి కలెక్టర్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది మరిచిపోకముందే రెండవ దఫా జరిపిన బదిలీల ప్రక్రియలో సీన్ రివర్స్ అయిపోయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 డిప్యూటీ తహశీల్దార్లు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16 మంది సీనియర్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించి డిప్యూటీ తహశీల్దార్లుగా ఆయా స్థానాల్లో భర్తీ చేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా సీనియర్ అసిస్టెంట్లుగా చాలా కాలం వివిధ హోదాల్లో పని చేసిన అభ్యర్థులకు మళ్లీ అక్కడే డిటిగా పదోన్నతి ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కలెక్టర్ ఏ అంశాన్నయితే ప్రాతిపదికగా తీసుకొని బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారో డిటిల నియామకానికి వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఏదో మతలబు దాగి ఉందన్న గుస గుసలు విన్పిస్తున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పి ‘దక్షిణ’ చెల్లించుకున్న వారికి పోస్టింగ్‌లు ఇప్పించడంలో కృతకృత్యులైనట్లు చెబుతున్నారు. ఇందులో జరిగిన బదిలీలను కొన్ని గమనిస్తే పై అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డిటిలకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఆయా సామాజిక వర్గాల సిబ్బంది తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ఎంతైనా ప్రస్తావనార్హం. ఇందులో వసంత అనే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారిణికి సీనియర్ అసిస్టెంట్ నుంచి డిటిగా పదోన్నతి ఇచ్చిన తరువాత ఆమె పెగడపల్లి స్థానాన్ని కోరుకున్నారు. అది కాకపోతే కనీసం కరీంనగర్ పరిసర మండలాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఆమెకు హుస్నాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చి అన్యాయం చేశారని ఆ వర్గానికి చెందిన సిబ్బంది ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.వనజాక్షి అనే వికలాంగురాలైన సీనియర్ అసిస్టింట్‌కు పదోన్నతి కల్పించిన అధికారులు ఆమె కోరుకున్న కరీంనగర్ లేదా జగిత్యాల పోస్టింగ్ ఇవ్వకుండా ప్రాధాన్యత లేని వేములవాడ ఎన్నికల డిప్యూటి తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌లోనే సీనియర్ అసిస్టెంట్‌గా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా సుదీర్ఘకాలంగా పని చేసిన అంజయ్యకు పదోన్నతి కల్పించిన తరువాత నిబంధనల ప్రకారం వేరే ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టింగ్‌ను ఇవ్వాల్సి ఉండగా ఈయన విషయంలో అధికారులు ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపించారు. కరీంనగర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా మరో నెల రోజుల్లో పదవీవిరమణ చేయాల్సి ఉన్న రాంనారాయణ స్థానానికి పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా ఆయన రిటైర్డ్ కాకుండానే అంజయ్యకు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని, జిల్లావ్యాప్తంగా ఇంకా 19 స్థానాలు ఖాళీగా ఉన్నా ఖాళీ కాని స్థానానికి బదిలీ చేయడం వెనుక మతలబు ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే మెట్‌పల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా దశాబ్ధానికి పైగా మెట్‌పల్లిలో విధులు నిర్వహించిన నాగార్జున అనే ఉద్యోగిపై కూడా అధికారులు వల్లమాలిన అభిమానాన్ని ప్రదర్శించారు. అక్కడ ఆయనపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పక్కన పెట్టి తిరిగి మెట్‌పల్లికే డిప్యూటీ తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల పట్టణానికే చెందిన రాజేశ్వర్ అనే సివిల్ సప్లరుూస్ డిప్యూటీ తహశీల్దార్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా సుమారు దశాబ్ధకాలానికి పైగా పని చేశారు. ఏడాది క్రితమే ఆయనకు గంగాధర సివిల్ సప్లయస్ డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తుండగానే తన పలుకుబడిని ఉపయోగించి స్వస్థలమైన జగిత్యాలలో పని చేసే నాగరాజమ్మ అనే ఉద్యోగినిని బదిలీ చేయించి మరీ అదే పోస్టింగ్‌ను పొంది అందరిని ఆశ్చర్యపర్చారు. ఈ తతంగం అంతా పరిశీలిస్తే రెండవ దఫా జరిగిన బదిలీల ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విషయం రూఢీ అవుతోంది. మరి ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారిస్తారో  లేదో వేచి చూడాల్సిందే !!

రెవెన్యూలో బది‘లీల’లు..

* కాసులిచ్చుకున్న వారికి కోరుకున్న పోస్టింగ్‌లు? * దళిత అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు! * అసంతృప్తితో రగులుతున్న డిప్యూటీ తహశీల్దార్లు


కరీంనగర్, నవంబర్ 29: కక్షసాధింపులో రెవెన్యూ శాఖ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇటీవల రెండు దఫాలుగా జరిగిన తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్ల బదిలీల ప్రహనంలో రెండవ దఫా జరిగిన బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. కాసులిచ్చుకున్న వారికే వారు కోరుకున్న పోస్టింగ్‌లు ఇచ్చి దళిత, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అధికారులకు ప్రాధాన్యత లేని స్థానాలు కట్టబెట్టారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఇంకా 19 డిప్యూటీ తహశీల్దార్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి పొందిన అభ్యర్థులకు వారు పని చేసిన చోటే పోస్టింగ్‌లు ఇవ్వడం ఈ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ కాసుల తతంగంలో రెవెన్యూలోని కలెక్టరేట్ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒక్కో డిప్యూటీ తహశీల్దార్ నుంచి లక్ష రూపాయలు మొదలుకొని మూడు లక్షల వరకు మామూళ్లు పుచ్చుకొని వారికి అనువైన పోస్టింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లా పగ్గాలు చేపట్టిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో 24 మంది తహశీల్దార్లు, 27 మంది డిప్యూటీ తహశీల్దార్లు స్థాన భ్రంశం కల్పించి సంచలనం సృష్టించారు. అప్పట్లో ఈ బదిలీలపై కించిత్ కూడా అసంతృప్తి కన్పించలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. ఆ 24 మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లు సుదీర్ఘకాలం అదే చోట పని చేయడంతో పాటు స్వస్థలాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు. దాంతో కలెక్టర్ వారిపై బదిలీ వేటు వేయడం పట్ల రెవెన్యూలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతేకాకుండా ప్రజల నుండి కలెక్టర్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది మరిచిపోకముందే రెండవ దఫా జరిపిన బదిలీల ప్రక్రియలో సీన్ రివర్స్ అయిపోయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 డిప్యూటీ తహశీల్దార్లు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16 మంది సీనియర్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించి డిప్యూటీ తహశీల్దార్లుగా ఆయా స్థానాల్లో భర్తీ చేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా సీనియర్ అసిస్టెంట్లుగా చాలా కాలం వివిధ హోదాల్లో పని చేసిన అభ్యర్థులకు మళ్లీ అక్కడే డిటిగా పదోన్నతి ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కలెక్టర్ ఏ అంశాన్నయితే ప్రాతిపదికగా తీసుకొని బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారో డిటిల నియామకానికి వచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఏదో మతలబు దాగి ఉందన్న గుస గుసలు విన్పిస్తున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పి ‘దక్షిణ’ చెల్లించుకున్న వారికి పోస్టింగ్‌లు ఇప్పించడంలో కృతకృత్యులైనట్లు చెబుతున్నారు. ఇందులో జరిగిన బదిలీలను కొన్ని గమనిస్తే పై అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డిటిలకు ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఆయా సామాజిక వర్గాల సిబ్బంది తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ సందర్భంగా ఎంతైనా ప్రస్తావనార్హం. ఇందులో వసంత అనే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారిణికి సీనియర్ అసిస్టెంట్ నుంచి డిటిగా పదోన్నతి ఇచ్చిన తరువాత ఆమె పెగడపల్లి స్థానాన్ని కోరుకున్నారు. అది కాకపోతే కనీసం కరీంనగర్ పరిసర మండలాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఆమెకు హుస్నాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చి అన్యాయం చేశారని ఆ వర్గానికి చెందిన సిబ్బంది ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.వనజాక్షి అనే వికలాంగురాలైన సీనియర్ అసిస్టింట్‌కు పదోన్నతి కల్పించిన అధికారులు ఆమె కోరుకున్న కరీంనగర్ లేదా జగిత్యాల పోస్టింగ్ ఇవ్వకుండా ప్రాధాన్యత లేని వేములవాడ ఎన్నికల డిప్యూటి తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌లోనే సీనియర్ అసిస్టెంట్‌గా, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా సుదీర్ఘకాలంగా పని చేసిన అంజయ్యకు పదోన్నతి కల్పించిన తరువాత నిబంధనల ప్రకారం వేరే ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టింగ్‌ను ఇవ్వాల్సి ఉండగా ఈయన విషయంలో అధికారులు ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపించారు. కరీంనగర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌గా మరో నెల రోజుల్లో పదవీవిరమణ చేయాల్సి ఉన్న రాంనారాయణ స్థానానికి పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా ఆయన రిటైర్డ్ కాకుండానే అంజయ్యకు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరమేమొచ్చిందని, జిల్లావ్యాప్తంగా ఇంకా 19 స్థానాలు ఖాళీగా ఉన్నా ఖాళీ కాని స్థానానికి బదిలీ చేయడం వెనుక మతలబు ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే మెట్‌పల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా దశాబ్ధానికి పైగా మెట్‌పల్లిలో విధులు నిర్వహించిన నాగార్జున అనే ఉద్యోగిపై కూడా అధికారులు వల్లమాలిన అభిమానాన్ని ప్రదర్శించారు. అక్కడ ఆయనపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పక్కన పెట్టి తిరిగి మెట్‌పల్లికే డిప్యూటీ తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే జగిత్యాల పట్టణానికే చెందిన రాజేశ్వర్ అనే సివిల్ సప్లరుూస్ డిప్యూటీ తహశీల్దార్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా సుమారు దశాబ్ధకాలానికి పైగా పని చేశారు. ఏడాది క్రితమే ఆయనకు గంగాధర సివిల్ సప్లయస్ డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తుండగానే తన పలుకుబడిని ఉపయోగించి స్వస్థలమైన జగిత్యాలలో పని చేసే నాగరాజమ్మ అనే ఉద్యోగినిని బదిలీ చేయించి మరీ అదే పోస్టింగ్‌ను పొంది అందరిని ఆశ్చర్యపర్చారు. ఈ తతంగం అంతా పరిశీలిస్తే రెండవ దఫా జరిగిన బదిలీల ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విషయం రూఢీ అవుతోంది. మరి ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారిస్తారో

v | రెవెన్యూలో బది‘లీల’లు.. | Andhra Bhoomi

v రెవెన్యూలో బది‘లీల’లు.. Andhra Bhoomi